బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ.. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే?

బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ.. ఎన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటే?

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) హీరోగా, క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్ట్ చేస్తున్న మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). బాలయ్య కు జోడిగా కాజల్(Kajal) నటిస్తుండగా.. శ్రీలీల(SreeLeela) కీలక పాత్రలో నటిస్తోంది. డైరెక్టర్ అనిల్ ఆరు సినిమాలతో ఒక ఓవర్ పూర్తిచేసి..భగవంత్ కేసరి చిత్రంతో సరికొత్త ఓవర్‌‌‌‌ను,‌‌‌‌ కొత్త ఇన్నింగ్స్‌‌‌‌ను స్టార్ట్‌‌‌‌ చేయబోతున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా రేపు (అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అనిల్ రావిపూడి..కంప్లీట్ హానెస్ట్ యాక్షన్ డ్రామాతో ఈ మూవీని తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాని చూసేందుకు బాలయ్య ఫ్యాన్స్..ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు రిలీజ్ కానున్న ఈ మూవీ..వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందనే ప్రశ్న అభిమానుల్లో మెదులుతుంది. ఎందుకంటే, ఈ దసరా సందర్భంగా..థియేటర్స్ లో స్టార్ హీరోస్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. తెలుగు, తమిళ్ లో ఫుల్ క్రేజీ సంపాదించుకున్న విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీస్ పోటీలో ఉన్నాయి. 

అయితే భగవంత్ కేసరి మూవీకి..రెండు తెలుగు రాష్ట్రాలలో  థియేటర్స్ భాగానే దొరికినట్లు సమాచారం. నైజాంలో చూసుకుంటే 285+ థియేటర్స్, సీడెడ్ లో 200+, ఆంధ్రాలో 410 థియేటర్స్ తో భగవంత్ కేసరి రిలీజ్ అవుతోంది. ఇక అవుటాఫ్ స్టేట్స్ చూసుకుంటే.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. ఓవర్సీస్ లో 350 థియేటర్స్ తో కలుపుకొని మొత్తం 1345 థియేటర్స్ లో బాలయ్య భగవంత్ కేసరి మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన ఈ మూవీ రూ.68.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో దసరా బరిలో నిలిచింది. బాలయ్య బాబు గత చిత్రాలు చూసుకుంటే..అఖండ,వీర సింహారెడ్డి మూవీస్ బక్సాపీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. ఇక రూ.68.50 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ చూసుకుంటే బాలయ్య స్ట్రామినాకి ఇది తక్కువనే చెప్పుకోవాలి. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే కనుక.. రిలీజైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడం చాలా తేలిక అని తెలుస్తోంది. 

కానీ, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూసుకుంటే భగవంత్ కేసరి మూవీ కంటే..విజయ్ లియోకి డిమాండ్ ఎక్కువ కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ..శ్రీలీల, బాలయ్య బాబు, అనిల్ రావిపూడి..వీరందరికీ ఉన్న క్రేజ్ తో సినిమా హిట్ కొట్టడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.  

ALSO READ : లైంగిక వేధింపుల కేసు: క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత