Vijay Deverakonda: ఇన్స్టాగ్రామ్లో దేవరకొండ మరో ల్యాండ్ మార్క్..ఆ స్టార్ హీరో తర్వాత విజయ్

Vijay Deverakonda: ఇన్స్టాగ్రామ్లో దేవరకొండ మరో ల్యాండ్ మార్క్..ఆ స్టార్ హీరో తర్వాత విజయ్

చిన్న చిన్న నాటకాల్లో నటించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)..రౌడీ బాయ్గా, స్టార్ భాయ్గా సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో అతిధి పాత్రల్లో నటించిన విజయ్..పెళ్లి చూపులు మూవీతో తెలుగు ఇండస్ట్రీని, అర్జున్ రెడ్డితో ఇండియా వైడ్గా ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..తన సోషల్ మీడియా ఖాతాలో కూడా మంచి గుర్తింపు పొందాడు. 

మనస్ ఏకం, వాచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మానం..ఈ సూక్తితో ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ట్యాగ్ కే చాలా మంది ఫాలోవర్లు మొదలయ్యారని సమాచారం. 

లేటెస్ట్గా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ స్టేటస్ను మరింత పెరిగేలా చేసుకున్నారు.విజయ్ ఇన్స్టాగ్రామ్ మరో ల్యాండ్ మార్క్కు చేరుకున్న అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఆయన 21 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. ప్రస్తుతం అల్లు అర్జున్కు 24 మిలియన్స్కి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

విజయ్ తన ఆటిట్యూడ్తో అమ్మాయిలలో మంచి క్రేజ్ని సొంత చేసుకున్నాడు. 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అవ్వడం అంటే..అంత ఈజీ కాదు. ఇపుడు విజయ్ ఈ మార్క్ను చేరుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా..విజయ్ తన కెరీర్ గురించి.. తన నుంచి రాబోయే కొత్త సినిమాల అప్డేట్స్ కూడా ఇస్తుంటారు. ఇక అప్పుడప్పుడు తనపై వచ్చే రూమర్స్కు..ఇన్స్టాగ్రామ్ వేదిక నుంచి రిప్లై ఇవ్వడం వల్ల మరింత ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. అలాగే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు.