Lal Salaam Trailer: క్రికెట్‌, కమ్యూనిజం అల్లర్లతో..ఆసక్తిగా రజినీ లాల్ సలామ్ ట్రైలర్

Lal Salaam Trailer: క్రికెట్‌, కమ్యూనిజం అల్లర్లతో..ఆసక్తిగా రజినీ లాల్ సలామ్ ట్రైలర్

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) స్పెషల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam). ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌ (Vishnu Vishal), విక్రాంత్‌ సంతోష్‌ (Vikramnth santhosh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 9వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఎంతో పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ ను క్రియేట్ చేస్తోంది. క్రికెట్‌, కమ్యూనిజం చుట్టూ జరిగిన అల్లర్లతో ట్రైలర్ ఆసక్తి పెంచుతోంది.రజనీ రోల్ ఎంతో పవర్​ ఫుల్​గా కనిపిస్తోంది.మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించిన తీరు, ఇంటెన్స్ లుక్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా..ఆద్యంతం ఆసక్తి కలిగించే పాత్రలతో తెరకెక్కించిన సీన్స్ గూస్బంప్స్ కలిగించేలా చేసింది డైరెక్టర్ ఐశ్వర్య. 

న‌టి జీవిత రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో భారీ స్థాయిలో లాల్ సలామ్ పై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆడియాన్స్ లో అంచనాలు పెంచేయగా..ట్రైలర్ రాకతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మరింత జోష్ తీసుకొచ్చింది. 

ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.