Cameraman Gangatho Rambabu : కెమెరామెన్ గంగతో రీ రిలీజ్..రేపు థియేటర్లలో అగ్ని తుఫానే

Cameraman Gangatho Rambabu : కెమెరామెన్ గంగతో రీ రిలీజ్..రేపు థియేటర్లలో అగ్ని తుఫానే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చి..యువకులలో సంచలనం స్పృష్టించిన మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman Gangatho Rambabu). ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ 2012 అక్టోబరు 18న దాదాపు1600 పైగా థియటర్లలో రిలీజై ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 12 ఏళ్ళ అయిన..పవన్ ఇచ్చిన ఇంపాక్ట్..ఇప్పటికీ గూస్బంప్స్ తెప్పిస్తోంది.

లేటెస్ట్గా ఈ మూవీ మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాను నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడ్యూసర్ నట్టి కుమార్ రేపు (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయబోతున్నారు.

అంతేకాకుండా ఈ సినిమా కలెక్షన్స్కు సంబంధించి..అమ్ముడుపోయిన ప్రతి టిక్కెట్ నుంచి 10 రూపాయలు జనసేనకు ఫార్టీ ఫండ్ ను అందజేస్తామని నట్టీ కుమార్ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా మరోసారి చాలా థియేటర్లలో రాబోతుంది.  అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కాబోతున్నాయి..అగ్ని తుఫాన్ ను చూడటానికి రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు ప్రొడ్యూసర్ నట్టీ కుమార్. 

ఈ సినిమా కథ విషయానికి వస్తే..పవన్ కళ్యాణ్ ఇందులో ఒక మెకానిక్. అందరికి మంచి చేసే వ్యక్తి. అన్యాయాలను ఎదురించే దైర్యశాలి. ఇలాంటి వాడు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితేనే కరెక్టని..టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ (తమన్నా) అతనికి జర్నలిస్టు జాబ్ ఇప్పిస్తుంది. అలా తనకు కనిపించే అన్యాయాలను ఎదిరించడానికి యువకులలో ఎలాంటి సత్తువ నింపాడో ఈ సినిమాలో ప్రధాన కథాంశంగా చూపించారు. ఈ సినిమా నాటి రాజకీయాలకే కాదు నేటి రాజకీయాలకు కూడా అద్దం పట్టే విధంగా ఉంటుంది.