IND vs ZIM : జింబాబ్వేతో చావో రేవో మ్యాచ్కి సిద్దమైన భారత్.. వర్షం ఎఫెక్ట్?

IND vs ZIM : జింబాబ్వేతో చావో రేవో మ్యాచ్కి సిద్దమైన భారత్.. వర్షం ఎఫెక్ట్?

IND vs ZIM : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 సూప‌ర్‌-8లో భాగంగా భార‌త్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య ఈరోజు (ఫిబ్రవరి 26న) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇరు జ‌ట్లు త‌మ తొలి మ్యాచ్‌ల్లో ఓడిపోవ‌డంతో సెమీఫైనల్ రేసులో నిల‌వాలంటే ఈ మ్యాచ్ గెలవాలి కాబట్టి, అటు భార‌త్‌, ఇటు జింబాబ్వే టీమ్స్ కి ఈ మ్యాచ్ ఎంతో కీల‌కం. ఓడిపోయిన జ‌ట్టు టోర్నీ నుంచి నిష్ర్క‌మించనుంది. ఈ వరల్డ్ కప్ లోని ప‌లు మ్యాచ్‌ల‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. దీంతో ప‌లు మ్యాచులు ర‌ద్దు కూడా అయ్యాయి కూడా. ఈ క్ర‌మంలో భార‌త్‌, జింబాబ్వే మ్యాచ్‌కు వాన ముప్పు ఏమైనా ఉందా ? అనే అనుమానం త‌లెత్తుతోంది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి అనే దానిపై అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది.  

వెదర్ రిపోర్ట:  
క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. భార‌త్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌కు ఎలాంటి వ‌ర్షం ముప్పు లేదని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉద‌యం ఉష్ణోగ్ర‌త 31 డిగ్రీల సెల్పియ‌స్‌గా ఉందని చెప్పింది. రాత్రి పూట వాతావ‌ర‌ణం చాలా క్లియర్ గా ఉంటుంద‌ని వెల్లడించింది. ఒక వేళ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే.. అప్పుడు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భార‌త్ సెమీస్ అవ‌కాశాలు మ‌రింత కఠినం అవుతాయి.  

ఇరు జట్ల అంచనా: 

టీమిండియా: 
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ,  శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా , అర్ష్‌దీప్ సింగ్ , జస్‌ప్రీత్ బుమ్రా , వరుణ్ చక్రవర్తి/ కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్/ వాషింగ్టన్ సుందర్

జింబాబ్వే..
సికందర్ రజా (కెప్టెన్‌), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, టినోటెండా మపోసా, తాడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ఎన్‌గార్రాబనీ