100 ఏళ్ల తర్వాత.. హోలీతో వస్తున్న చంద్రగ్రహణం : హోలీ దహనం.. గ్రహణ సూత కాలం తెలుసుకోండి..!

100 ఏళ్ల తర్వాత.. హోలీతో వస్తున్న చంద్రగ్రహణం : హోలీ దహనం.. గ్రహణ సూత కాలం తెలుసుకోండి..!

జ్యోతిష్య పండితులు.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాలప్రకారం  వంద సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం మార్చి 3 వ తేదీన ఏర్పడుతుంది. ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన. హోలీ .. చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి కాబట్టి.. హోలికాదహనం ఎప్పుడు చేయాలి.. గ్రహణ సూతకాలం ఏ సమయంలో ఉంటుంది.. ఎలాంటి నియమాలు పాటించాలి ..మొదలగు విషయాలను ఈ స్టోరీలో  తెలుసుకుందాం...

వంద సంవత్సరాల తరువాత హోళీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.   ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది.   దీని వల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు.  అందువలన ..బ్లడ్ మూన్..  అని పిలుస్తారు ఈ చంద్ర గ్రహణం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సింహ రాశిలో  ఏర్పడుతుంది. భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది.అందువలన సూతకాలం నిమయాలు పాటించాలని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

సూతక కాలం ఎప్పుడు 

ఈ ఏడాది (2026) మార్చి 3న  చంద్రగ్రహణం  సూతక కాలం  గ్రహణ సమయానికి 9 గంటల ముందుగానే చెల్లుబాటు అవుతుంది. భారత కాలమానం ప్రకారం  సూతక కాలం ఉదయం 6:20 గంటలకు  ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో సూతక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో దేవుడి పటాలు.. విగ్రహాలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు  ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు పండితులు.

చంద్రగ్రహణం  సమయం  
 

  • గ్రహణం ప్రారంభ సమయం:  2026 మార్చి 3 మధ్యాహ్నం 3.20 గంటలకు
  • గ్రహణం ముగింపు సమయం : 2026 మార్చి 3 సాయంత్రం 6.47 గంటలకు 
  • సూతకాలం ప్రారంభ సమయం :  2026 మార్చి 3 ఉదయం 6.20 గంటలకు
  • సూతకాలం ముగింపు:  గ్రహణం పూర్తయ్యేంత వరకు 
  • భారతదేశంలో కనిపించే సమయం: సాయంత్రం 6.20 గంటల నుంచి 27 నిమిషాలు
  • గ్రహణం పూర్తి సమయం : 3 గంటల 27 నిమిషాలు
  • మోక్షకాలం : 6.48 గంటలకు.

హోలికా దహనం, హోలీ తేదీ

హోలి పండుగ ఫాల్గుణ మాసం పూర్ణిమ రోజు వస్తుంది.  ఈ ఏడాది ( 2026) ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2న సాయంత్రం 05:55 గంటలకు ప్రారంభమై, మార్చి 3న సాయంత్రం 05:07 గంటలకు ముగుస్తుంది. హోలీ జరుపుకునే తేదీని నిర్ణయించడంలో పౌర్ణమి తిథి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  

ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి వివరాలు: 

  • పూర్ణిమ తిథి ప్రారంభం: మార్చి 02, 2026న సాయంత్రం 05:55 గంటలకు
  • పూర్ణిమ తిథి ముగింపు : మార్చి 03, 2026న సాయంత్రం 05:07 గంటలకు

హెూలికా దహనానాకి శుభ ముహూర్తం 

  •  మార్చి2 సాయంత్రం 06:22 గంటల నుంచి రాత్రి 08:50 గంటల వరకు 
  • భద్ర కాలం :  మార్చి 3 ఉదయం 01:25 నుంచి గంటల వరకు  04:30 వరకు

 ప్రదోష కాలంలో, పూర్ణిమ తిథి ప్రకారం మార్చి2 సాయంత్రం హోలికా దహనం జరుపుకోవాలి.  
భధ్రకాలానికి ముందుగా హోలికాదహన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.