T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న సూపర్–8 మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ కి రానుంది. టాస్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టాస్ ఏదైనా సరే, మేం బ్యాటింగ్‌కే సిద్ధంగా ఉన్నాం.. జట్టులో వాతావరణం చాలా రిలాక్స్‌గా ఉంది.. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో మర్చిపోయి ముందుకు వెళ్లాలని ప్లేయర్స్ కి చెప్పాం.. గెలుపు–ఓటమి కామన్, ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామని అన్నాడు. ఈ మ్యాచ్‌కు జట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, రింకు సింగ్ స్థానంలో సంజూ శాంసన్‌లని తుది జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.
మరోవైపు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. చెన్నై పిచ్ తడిగా కనిపిస్తోంది.. మా సీమర్లకు ఇది అనుకూలంగా ఉంటుందని భావించి ఫీల్డింగ్ తీసుకున్నాం.. భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగితే మ్యాచ్‌లో పైచేయి సాధించవచ్చు అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక టాక్టికల్ మార్పు చేసినట్లు తెలిపాడు. గ్రేమ్ క్రెమర్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో టినోటెండా మపోసా తుది జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.
జింబాబ్వే: తడివానాషే మారుమణి (వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా (కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.
భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
