T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్లు కాసేపట్లో కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సూపర్–8 మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరగనుంది. సెమీఫైనల్ కి వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకూ అత్యంత కీలకం. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలోకి అడుగు పెట్టిన భారత్, సూపర్–8లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడింది. దీంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. జింబాబ్వేపై విజయం సాధిస్తే భారత్‌కు సెమీఫైనల్ అవకాశాలు కొంచెం బలపడతాయి. మరోవైపు జింబాబ్వే కూడా ఈ మ్యాచ్‌ను ‘డూ ఆర్ డై’గా భావిస్తోంది.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలోని పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమతుల్యం కలిగిన జట్టును బరిలోకి దించే అవకాశం ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ లకు మళ్లీ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అలాగే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. పేస్ బాధ్యతలను బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ భుజాన వేసుకోనున్నారు.
హెడ్ టు హెడ్ రికార్డు:
* భారత్ – జింబాబ్వే మధ్య 13 మ్యాచ్‌లు
* భారత్ విజయం: 10
* జింబాబ్వే విజయం: 3
* 2022లో టీ20 వరల్డ్ కప్‌లో పోటీ పడ్డాయి.. ఆ మ్యాచ్‌లో ఈజీగా గెలిచిన భారత్
భారత్ జట్టు అంచనా:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
జింబాబ్వే ప్లాన్:
సికందర్ రజా నాయకత్వంలో జింబాబ్వే జట్టు ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ ప్రస్తుతం జట్టులో పెద్దగా మార్పులు చేయకుండానే అదే కాంబినేషన్‌ని కొనసాగించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లపై జట్టు ఎక్కువగా ఆధారపడనుంది.
జింబాబ్వే జట్టు అంచనా:
బ్రియాన్ బెన్నెట్, టాడివనాషే మరుమాని (వికెట్‌కీపర్), డియాన్ మేయర్స్, సికందర్ రజా (కెప్టెన్), రయాన్ బర్ల్, టోనీ మున్యోంగా, టషింగా ముసేకివా, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, గ్రేమ్ క్రెమర్, బ్లెసింగ్ ముజరబానీ
