కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పులపాలు.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు: మంత్రి వివేక్

కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పులపాలు.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు: మంత్రి వివేక్

హైదరాబాద్: కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని.. కమీషన్ల కోసమే ఆయన ప్రాజెక్టులు కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 

రూ.లక్షా 75 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేశారని.. కానీ నాలుగేండ్లకే ఆ ప్రాజెక్ట్ కుప్పకూలిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ప్రజలపై మోయలేని భారం పడిందన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు, సొంత ఆస్తులు పెంచుకుందని అన్నారు. ప్రపంచంలోనే ధనిక రీజనల్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు కేసు సీబీఐకి అప్పగించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చారని అన్నారు.