ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. Galaxy S26 పేరుతో వస్తున్న ఈ ఫోన్‌లలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అల్ట్రా మోడల్‌లో ఇంతకుముందు లేని సరికొత్త టెక్నాలజీని వాడారు. ఈ సిరీస్‌లో Galaxy S26, S26 Plus, S26 Ultra ఉన్నాయి. S26 అల్ట్రా 1440p రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేతో ఉండగా.. S26కి 6.3-అంగుళాల డిస్‌ప్లే, S26కి ప్లస్ 6.7-అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు.
Galaxy S26 Ultra స్పెషాలిటీ ఏంటంటే:
ఈ ఫోన్ అన్నింటికంటే పవర్‌ఫుల్ అండ్ ఖరీదైనది. దీనిలోని ముఖ్యమైన ఫీచర్లు చూస్తే ప్రపంచంలోనే మొదటిసారిగా ఇందులో ప్రైవసీ డిస్‌ప్లే ఇచ్చారు. మీరు బస్సుల్లో లేదా హోటల్స్‌లో ఉన్నప్పుడు పక్కవాళ్లు మీ ఫోన్ స్క్రీన్ చూడకుండా అడ్డుకుంటుంది. కేవలం మీకు మాత్రమే స్క్రీన్ కనిపిస్తుంది. ఈ ఫోన్ కేవలం 7.9mm మందంతో, శామ్‌సంగ్ చరిత్రలోనే అత్యంత సన్నని అల్ట్రా ఫోన్‌గా నిలిచింది. ఇందులో 60W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. దీనివల్ల 30 నిమిషాల్లోనే ఫోన్ 75% ఛార్జ్ అయిపోతుంది. అలాగే 'స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5' అనే పవర్‌ఫుల్ చిప్ ప్రాసెసర్ వాడారు.
కెమెరా అండ్ AI (కృత్రిమ మేధస్సు)
చీకటిలో కూడా పగటిపూట తీసినంత స్పష్టంగా ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
AI ఫీచర్లు
సెల్ఫీలలో స్కిన్ టోన్ సహజంగా వచ్చేలా AI సహాయం చేస్తుంది. అలాగే శామ్‌సంగ్ 'పెర్ప్లెక్సిటీ' అనే సంస్థతో చేతులు కలిపి కొత్త AI చాట్‌బాట్‌ను కూడా తీసుకొచ్చింది. మీరు ఈ ఫోన్ కొంటే ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి.ఈ ఫోన్‌లతో పాటు కొత్త ఇయర్‌బడ్స్ Galaxy Buds 4ను కూడా విడుదల చేశారు. బడ్స్ 4 ప్రోలో నాయిస్ క్యాన్సిలేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తాయి.
ధర విషయానికొస్తే, Galaxy S26 ధర రూ. 87,999 నుండి, Galaxy S26 ప్లస్ ధర రూ. 1,19,999 నుండి, Galaxy S26 అల్ట్రా ధర రూ. 1,39,999 నుండి ప్రారంభమవుతుంది. Galaxy Buds 4 ధర రూ. 16,999, Galaxy Buds 4 Pro ధర రూ. 22,999. మీరు ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారైతే అలాగే సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే S26 Ultra ఫోన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
