గురువారం తగ్గిన గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

గురువారం తగ్గిన గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

ఈ వారం బంగారం, వెండి రేట్లు దాదాపుగా స్థిరంగానే కొనసాగుతున్నట్లు చెప్పుకోవచ్చు. ఒకరోజు పెరిగినా మళ్లీ తర్వాత తగ్గుతూ ఉన్నాయి విలువైన లోహాలు. అమెరికా కోర్టు తీర్పు తర్వాత తగ్గుతున్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా తాజా రేట్లను గమనించటం ముఖ్యం. 

ఫిబ్రవరి 26న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 25 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.21 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 168గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 820గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : ఏప్రిల్‌ నుంచి పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్

ఇక వెండి విషయానికి వస్తే  ఫిబ్రవరి 26, 2025న రేటు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 95వేలకు చేరుకుంది. అంటే గ్రాము ధర రూ.295 వద్ద ఉంది.