ఏపీ శాసన మండలిలో తెలంగాణ నీళ్ల లొల్లి.. రాయలసీమ లిఫ్ట్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ..

ఏపీ శాసన మండలిలో తెలంగాణ నీళ్ల లొల్లి.. రాయలసీమ లిఫ్ట్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ..
  • తాము చెప్తే జగన్ ఆపారని హరీశ్ అసెంబ్లీలోనే చెప్పారన్న టీడీపీ
  • రేవంత్ సర్కారుతో చంద్రబాబు లాలూచీ పడ్డారన్న వైసీపీ 
  • వైసీపీ హయాంలోనే ఆ ప్రాజెక్టును ఎన్జీటీ ఆపిందన్న పయ్యావుల కేశవ్ 
  • రాయలసీమ ప్రాంతానికి నిజమైన ద్రోహి జగన్ అంటున్న టీడీపీ లీడర్లు 
  • పోలవరం, నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదన్న సీఎం చంద్రబాబు
  • తెలంగాణలో కాళేశ్వరం నిర్మిస్తే తాము అభ్యంతరం చెప్పలేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ నీళ్లపై వివాదం నెలకొంది. రాయలసీమ లిఫ్ట్ నిలుపుదలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రాజెక్టును నిలుపుదల చేయించింది మీరంటే మీరని ఇరు పార్టీల నాయకులు విమర్శల కు దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఆపిందని.. ఆ ప్రాంతానికి సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని వైసీపీ సభ్యులు విమర్శించారు. 

తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి ప్రాజెక్టును నిలి పివేశారని వైసీపీ సభ్యులు ఇషాక్ బాషా, రామసుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై టీడీపీ సైతం కౌంటర్ అటాక్ కు దిగింది. తాము చెప్తేనే జగన్ రాయల సీమ ప్రాజెక్టును ఆపేశారంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలంగాణ అసెంబ్లీలోనే ప్రకటించారని మంత్రి నిమ్మల చెప్పారు. 2020లో ఎన్జీటీకి వెళ్లి రాయల సీమ ఎత్తిపోతలను తామే ఆపామని హరీ శిరావు తెలిపారని మంత్రి నిమ్మల అన్నారు. 

అప్పటి సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటంతో ప్రాజెక్టు ఆగిందని హరీశ్రావు స్పష్టం చేసిన విషయాన్ని తెలు సుకోవాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి నిజమైన ద్రోహి జగన్ అని.. ఆయన్ను నిలదీ యకుండా తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వైసీపీ హయాంలోనే సీమలోని ప్రాజెక్టులన్నీ తీవ్ర నిర్లక్ష్యానికి గు రయ్యాయని విమర్శించారు. ఆ ప్రాంతానికి నీరిచ్చేందుకు ఒక్క ప్రాజెక్టునూ జగన్ చేపట్టలేదని మండి పడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనపై ఎక్కడా సమాధానం ఇవ్వలేదంటూ వైసీపీ సభ్యులు బొత్స సత్యనా రాయణ నిరసన తెలిపారు. దీంతో సభను మండలి చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.

పోలవరం-నల్లమల సాగర్ ఎవరికీ నష్టం లేదు.. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం. నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం. లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటినే తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపైనే కట్టారని, తాను ఏనాడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. 

నల్లమల సాగర్ . తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప సష్టం లేనేలేదని అన్నారు. తాముకాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని... తెలంగాణ వాళ్లు కూడా నల్లమల సాగరు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని.. నీళ్లు ఉంటే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని అన్నారు. టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని నదుల అనుసందానంపై ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు అన్నారు.