T20 World Cup: సౌతాఫ్రికా, విండీస్ మధ్య జరిగిన మ్యాచ్ ధనాధన్.. ఫటాఫట్ లా జరిగింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫటాఫట్.. ధనాధన్ అన్నట్లు.. 16.1 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయ్యింది. విండీస్ విసిరిన 177 పరుగులు లక్ష్యాన్ని.. జస్ట్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి.. 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది.
కాగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో రొమారియో షెపర్డ్ (52), జేసన్ హోల్డర్ (49)ల అద్భుతమైన బ్యాటింగ్ చేయగా, బ్రాండన్ కింగ్ (21), షాయ్ హోప్ (16 ) ఫర్వాలేదనిపించారు.
అనంతరం 177 పరుగులు లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా జట్టు ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ప్రోటీస్ జట్టు ఓపెనర్లు క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రామ్ లు మధ్య 95 పరుగుల భాగస్వామ్యాన్ని రోస్టన్ చేజ్ విడగొట్టాడు. డి కాక్ కి వేసిన బాల్ ని షాట్ ఆడగా, లాంగ్-ఆన్ లో జాసన్ హోల్డర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 95 పరుగుల వద్ద సఫరీ జట్టు తొలి వికెట్ ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ బాధ్యతలు చేపట్టిన కెప్టెన్ మార్క్రామ్ 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సులతో 82 పరుగులతో నాటౌట్ గా నిలవగా, మరో ఎండ్ లో ర్యాన్ రికెల్టన్ సైతం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి టీమ్ ని గెలిపించారు.
The Proteas inch closer to a #T20WorldCup semi-final spot with a comprehensive win over the West Indies 👌
— ICC (@ICC) February 26, 2026
📝: https://t.co/7sIwZ3AL3T pic.twitter.com/00jaM4QsVT
