Prabhas Spirit: ప్రభాస్, సందీప్ స్పిరిట్ మూవీ.. టార్గెట్ వెయ్యి కోట్లు!

Prabhas Spirit: ప్రభాస్, సందీప్ స్పిరిట్ మూవీ.. టార్గెట్ వెయ్యి కోట్లు!

స్పిరిట్(Spirit).. ఈ సినిమాను చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga). ప్రభాస్(Prabhas) హీరో కావడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఇక ఇటీవల వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో స్పిరిట్ లెక్కలు రోజురోజుకి మారుతున్నాయి. ఇక సందీప్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ స్పిరిట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతూ.. యానిమల్ సినిమా కంటే ఎక్కువ వైలెన్స్ స్పిరిట్ లో ఉంటుందని, అందులో ప్రభాస్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపిస్తారని చెప్పుకొచ్చాడు. 

దీంతో స్పిరిట్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజానికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోలు యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్ గా ఉంటారు. అదే మెయిన్ హైలెట్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అదే రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆశగా ఉన్నాడు. ప్రభాస్ కటౌట్ కి యాటిట్యూడ్ మిక్స్ అయితే ఆ అవుట్ ఫుట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం చాలా కష్టం. సందీప్ యానిమల్ సినిమాతో దాదాపు రూ.900 కోట్ల మార్క్ ను టచ్ చేశాడు. 

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు స్పిరిట్ సినిమా కోసం మేకర్స్ వెయ్యి కోట్ల మార్కుని టార్గెట్ గా పెట్టుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగా కు ఉన్న క్రేజ్ కి వెయ్యి కోట్ల టార్గెట్ అంటే తక్కువే. అనుకున్న రేంజ్ లో గనుక స్పిరిట్ వచ్చిందంటే ఇండియా లెవల్లో ఏ స్టార్ కూడా కొట్టని రికార్డ్స్ కొట్టడం ఖాయం. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.