12th Fail: తెలుగులో వచ్చేసిన 12th ఫెయిల్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

12th Fail: తెలుగులో వచ్చేసిన 12th ఫెయిల్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

ఇటీవల బాలీవుడ్ లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం 12th ఫెయిల్(12th Fail). ప్రముఖ IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ(Manoj kumar sharma) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, మేధ శంకర్ హీరోహీరోయిన్స్ గా నటించగా.. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. ఎన్నో అనుమానాల మధ్య విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Also read : క్రాక్స్ వేస్కొని మిడిల్ క్లాస్ అంటావేంటన్నా.. విజయ్ కౌంటర్ అదుర్స్

కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు ప్రతిష్టాత్మక అవార్డ్స్ కూడా గెలుచుకుంది ఈ మూవీ. బాలీవుడ్ లో ఇటీవల ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ సినిమా ఏకంగా ఐదు అవార్డులను దక్కించుకుంది. అందులో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ క్యాటగిరీస్ ఉన్నాయి.

అయితే 12th ఫెయిల్ సినిమా సూపర్ హిట్ అని తెలియడంతో.. చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాను హిందీలోనే చూశారు. కానీ, కొంతమంది మాత్రం ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలంటూ మేకర్స్ కు రిక్వెస్ట్ చేశారు. వారి కోరికను కన్సీడర్ చేసిన మేకర్స్.. 12th ఫెయిల్ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. కేవలం తెలుగులోనే కాదు సౌత్ భాషలైన తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రిలేస్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అన్ని భాషల్లో అందుబాటులో ఉంది ఈ సినిమా. మరి హిందీ అర్థం కాక చూడలేని ఆడియన్స్ ఇప్పుడు తెలుగులో ఈ సినిమాను చూసేయొచ్చు.