Vijay Devarakonda: క్రాక్స్ వేస్కొని మిడిల్ క్లాస్ అంటావేంటన్నా.. విజయ్ కౌంటర్ అదుర్స్

Vijay Devarakonda: క్రాక్స్ వేస్కొని మిడిల్ క్లాస్ అంటావేంటన్నా.. విజయ్ కౌంటర్ అదుర్స్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దర్శకుడు పరశురామ్(Parasuram) కాంబోలో వస్తున్న రెండో మూవీ ది ఫ్యమిలీ స్టార్(The Family Star). ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన గీతగోవిందం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్ లో ఆకట్టుకుంటున్నాడు విజయ్. ఆయన మిగతా సినిమాల కన్నా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అందుకే ఈ టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ టీజర్ చూసిన ఓ నెటిజన్ విజయ్ దేవరకొండను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దానికి అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు విజయ్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సినిమా టీజర్ రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో విజయ్ క్రాక్స్ ఫుట్ వేర్ వేసుకొని కనిపించాడు. ఆ ఫోటోను చూపిస్తూ.. ఈ క్రాక్స్ ధర మినిమమ్ రూ.2000 ఉంటుంది. అలాంటివి వెస్కొని.. మిడిల్ క్లాస్ అంటావ్.. నువ్వు సూపర్ అన్నా.. అంటూ రాసుకొచ్చాడు. 

అది చూసిన విజయ్.. 70% ఆఫర్ సేల్ ఉంటే కొన్నాను బ్రో.. అంటూ కౌంటర్ వేశాడు. దీంతో విజయ్ చేసిన ఈ కామెంట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరికొందరేమో.. పాత సినిమాల్లో లాగా మిడిల్ క్లాస్ అంటే పరాగన్ చెప్పులు వేయించి చూపించాలా.. మారండి భయ్యా.. అని ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.