ప్రతి ఒక్కరూ నిజమైన ప్రేమకోసం వెతుకుతుంటారు. అది ఎలా ఉంటుందో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అనంతమైన అన్ కండీషనల్ ప్రేమ సముద్రంలో మనం పుట్టాం. ఆ ప్రేమను మనం ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం మనం అలాంటి ప్రేమను వెతుక్కుంటూనే ఉంటాం. పొందుతూనే ఉంటాం.
మనం ఒకసారి ఒకరిని ప్రేమిస్తే “ అది పర్మినెంట్ ఎమోషనా? లేక పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుందా? ఎందుకంటే నేను ప్రేమించిన వారి పట్ల నా ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి" అని ఒకాయన నన్ను అడిగాడు. నిజమైన అనకండిషనల్ లవ్ అనేది ఎప్పటికీ మారదు. కానీ, సహజంగానే దీనిమీద మనకు ఒక ఐడియా అంటూ ఉండదు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు అనంతమైన ప్రేమను ఫీలవుతాం.. కానీ, వయసు పెరిగేకొద్దీ మనం చూసే ప్రేమ తగ్గుతూ పోతుంటుంది. మనం తక్కువలో తక్కువ ప్రేమను చూస్తున్నా ఆ ప్రేమ తాలూకు రుచి తెలుసు కాబట్టి, దానికోసం జీవితాంతం అన్వేషిస్తూ ఉంటాం తపిస్తుంటాం.
తల్లి ప్రేమ నుంచి..
నిజమైన ప్రేమ హృదయంలో నుంచి. ఆత్మలోనుంచి వస్తుంది. ప్రతి హృదయం. ప్రతి ఆత్మప్రేమమయమే! అయితే, మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ మనలో ఆహం పెరగడమే సమస్య తెచ్చి పెడుతుంది. మన ఆలోచనలు. నమ్మకాలు, కండిషన్స్, అటీట్యూర్స్, వాల్యూస్, ఐడెంటిటీస్ అన్నింటినీ కలిపితే వచ్చేదే అహం (ఈగో) భయం.. దుఃఖం, కోపం, గర్వం.. లాంటివన్నీ ఈగోలో కలిసి ఉంటాయి. ఇవే ఈ ప్రపంచంలో మన గుర్తింపుగా మారతాయి. ఈగో పెరిగేకొద్దీ.. అది హృదయాన్ని, ఆత్మని చీకటి మబ్బులా కమ్మేస్తుంది.
తల్లి గర్భంలో ఓ పిల్లవాడు ఉన్నప్పుడు.. ఆ పిల్లాడు ఆమెలోభాగం. వాళ్ల ఇద్దరి బడెంటిటీ ఒక్కటే! కాబట్టి, ఆ తల్లీపిల్లల మధ్య ఎలాంటి ఈగో ఉండదు. పుట్టిన తర్వాత ఆ పిల్లాడిని తల్లి అన్కండిషనల్గా ప్రేమిస్తుంది. ఆటైంలో ఆమె కూడా ఆ పిల్లాడ్ స్టేజీలో ఉంటుంది. ఈ పిల్లాడిగా ఉన్నప్పుడు ఎలాంటి ఈగోలేని పరిశుద్ధమైన ఆత్య హృదయంతో ఉంటారు.
►ALSO READ | ఎవరైనా ఇన్సల్ట్ చేశారా..? చంపేసెంత కోపం వస్తోందా...? ఆవేశపడకుండా.. ఇలా చేయండి..!
అందుకే ఆ తల్లీబిడ్డల మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుంది. పిల్లదు పెరిగేకొద్దీ అతనిలో ఈగో డెవలప్ అవుతూ ఉంటుంది.సెపరేషన్ మొదలవుతుంది. ఒకవైపు తల్లి. బడెంటిటీ, మరోవైపు పిల్లాడి బడెంటిటీ (ఈగో) ఈ రెండింటి మధ్య ఒరిజనల్ ప్రేమ కాస్త వంద శాతం నుంచి నెమ్మదిగా తగ్గుతూ పోతుంది.
మన నుంచే
ప్రేమ అంటే కేవలం కరుణ మాత్రమే కాదు. కదుపులో ఉన్నప్పుడు. పుట్టిన వెంటనే తన బిడ్డ కోసం తల్లి ఎలా పరితపిస్తుందో అదే నిజమైన ప్రేమ. అన్కండిషనల్ లవ్! ఏ ఇతర రిలేషన్ షిప్స్ ని చూసినా మన ఈగో పల్ల బాధల్లో, కోపంలో, భయంకరమైన భవిష్యత్తులో చిక్కుకొని నలిగిపోతుంటాయి. ఈగో ఉన్న మనుషుల ప్రవర్తన టైం టైం మారుతూ ఉంటుంది. దాని వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి. నిజమైన ప్రేమను. కనుక్కోవాలనుకునేవాళ్లు. ముందు తమలో ఆ ప్రేమను కనుక్కున్న తర్వాత ఆ ప్రయత్నం మొదలుపెట్టాలి.
ఈగో నడిపించే ప్రవర్తనలను దాటి మనుషుల హృదయాల లోతుల్లోకి చూడాలి. మన హృదయం అనే పువ్వు విచ్చుకునేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడే ఇతరుల ఆత్మను క్లియర్ చూడగలం. చిన్నపిల్లల్ని, జంతువుల్ని ఆన్కండిషనల్గా ప్రేమించడం చాలా ఈజీ. ఎందుకంటే అప్పుడు. కేవలం మనకు మాత్రమే ఈగో ఉంటుంది. పిల్లలూ, జంతువులు మన ఈగోను టచ్ చేయడం చాలా రేర్ గా ఉంటుంది. మన ఈగో ఇతరుల ఈగోతో టచ్ అయినప్పుడే ప్రాబ్లమ్!
ఈగోను ఫిల్టర్ చేస్తే..
రెండు హృదయాలు లేదా రెండు ఆత్మల మధ్య ఉండే కనెక్షన్నే నిజమైన ప్రేను అంటాం. ఒకవేళ మనం ఎవరివైనా ప్రేమిస్తే ఆ ప్రేను నిజమైతే, అది ఇద్దరిలో ఉండే ఈగోన ఫిల్టర్ చేస్తుంది. మనం వాళ్ల హృదయంలో భాగం అని చూడగలిగితే.. ఆ ప్రేమ అలాగే ఉంటుంది. అలాకాకుండా. ఎదుటి వ్యక్తి ఈగో మీరే ఫోకస్ చేస్తే మాత్రం.. ప్రేమ మాయమవుతుంది. మనం ఈగోను బైపాస్ చేయగలిగినప్పుడే ఎదుటి వ్యక్తి హృదయంతో, ఆత్మతో కనెక్ట్ కాగలం ఇచే ఇద్దరి వ్యక్తులకు వర్తిస్తుంది.
మనం మన ఈగోను తగ్గించుకోగలిగితే ఎదుటి వ్యక్తిని క్లియర్గా చూడగలుగుతాం. ఎదుటి వ్యక్తి ఈగో మీద కాకుండా ఆత్మ మీద ఫోకస్ పెట్టగలిగితే.. వాళ్లను ప్రేమించగలం, ఎదుటి వ్యక్తి ఈగోను దాటి చూసినప్పుడే వాళ్లతో మనకు మంచి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది! అప్పుడే వాళ్లను క్షమించగలుగుతాం ఈగో వాళ్లను నడిపిస్తుందని మనకు తెలుసు కాబట్టి, వాళ్లను మరింత కరుణతో డీల్ చేస్తాం. మనలో ఈగో తగ్గిపోయిన కొద్దీ మనం పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలా మారుతాం.
