ఎవరైనా ఇన్సల్ట్ చేశారా..? చంపేసెంత కోపం వస్తోందా...? ఆవేశపడకుండా.. ఇలా చేయండి..!

ఎవరైనా ఇన్సల్ట్ చేశారా..? చంపేసెంత కోపం వస్తోందా...? ఆవేశపడకుండా.. ఇలా చేయండి..!

మనకు కోపంవచ్చినప్పుడు..బాధపడతాం. అంటే కోపంవెంటనే బాధఉంటుందన్నమాట! నిజంగా దీన్ని అర్థం చేసుకోగలిగితే.. ఇతరుల కోపాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్లు బాధపడుతున్నారనీ అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు...వాళ్లని శత్రువుల్లా చూస్తుంటాం.

కోపం పెరిగేకొద్దీ ఎదుటివాళ్లను శిక్షించాలనే కోరిక బలంగా మారుతుంది. మనం ఆ వ్యక్తి వల్ల బాధ పడుతున్నాం. కాబట్టి అతడ్ని శిక్షించాలనుకుంటాం. మనలో కోపం ఉందంటే... మనలో వయొలెన్స్ ఉందని అర్థం. అందుకే అచ్చంగా వాళ్లలాగే ప్రవర్తిస్తాం. 

మన కోపం, బాధ ఎదుటి వాళ్ల కోపం, బాధలో తేడా ఏం ఉండదని తెలుసుకోగలిగినప్పుడు.. మనం మరింత ప్రేమగా, కరుణతో డీల్ చేస్తాం. కాబట్టి, ఇతరులను అర్థం చేసుకోవడం అంటే.. మనల్ని మనం అర్థం చేసుకున్నట్టే! అలాగే. మనల్ని మనం అర్థం చేసుకుంటే.. ఇతరులను అర్థం చేసుకున్నట్టే!!

మన నుంచే మొదలవ్వాలి

కచ్చితంగా అన్నీ మన నుంచే మొదలవ్వాలి. మన ఇంటికి నిప్పు అంటుకుందని తెలిస్తే.. అర్జెంట్గా ఇంటికెళ్లి ఆ మంటల్ని ఆర్పే
ప్రయత్నం చేయాలి. అంతేగానీ, 'నా ఇంటిని ఫలానా వాడు తగలబెట్టాడు' అనే అనుమానంతో, తప్పుడు నమ్మకంతో వాడి వెంట పరుగెత్తకూడదు. ఒకవేళ అనుమానంతో ఆ వ్యక్తి వెంట పరుగులు తీస్తే తగలబడేది మన ఇల్లే! అది వివేకం అనిపించుకోదు. 

ALSO READ : మీకు తెలుసా :పాతకాలంలో పళ్ళు ఎలా తోముకునేవారో తెలుసా

కాబట్టి, మనం కచ్చితంగా తిరిగి ఇంటికెళ్లి మంటలు ఆర్పడానికి ట్రై చేయాలి. మనం ఒకరిపై కోపంతో ఉండి, కంటిన్యూగా వాళ్లతో వాదించుకుంటూ ఉన్నా, వాళ్లను శిక్షించడానికి కంటిన్యూగా ట్రై చేస్తూ ఉన్నా... ఇది అచ్చంగా వాళ్ల వెంట పరుగెత్తడం లాంటిదే!

-తీచ్ నాటాన్