ఏ పంటా వేయకుండా ఖాళీగా భూములు

 ఏ పంటా వేయకుండా ఖాళీగా భూములు
  •    ప్రతి చెరువు కట్ట కింద 5 నుంచి 40 ఎకరాల్లో బురద
  •     రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఇదే పరిస్థితి
  •     ఆరుతడి పంటలకు పనికి రావంటున్న ఆఫీసర్లు
  •     ఏ పంటా వేయకుండా ఖాళీగా భూములు
  •     దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
  •     రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఇదే పరిస్థితి
  •     ఆరుతడి పంటలకు  పనికి రావంటున్న ఆఫీసర్లు
  •     ఏ పంటా వేయకుండా ఖాళీగా భూములు
  •     దిక్కుతోచని స్థితిలో రైతన్నలు
  •   ప్రతి చెరువు కట్ట కింద 5 నుంచి 40 ఎకరాల్లో బురద


జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: చెరువులు, కుంటల కింద సాగులో ఉన్న భూమిలో 50 శాతానికి పైగా పొలాల్లో  ఇప్పటికే నీళ్లు.. బురద ఉన్నాయి. ఈ భూములలో వరి తప్ప ఇతర పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు చెరువుల కింద భూములను పడావుగా ఉంచుతున్నారు. రాష్ట్రంలో మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద 46,711 చెరువులున్నాయి. వీటి కింద 20 లక్షలకు ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. ప్రతి వానాకాలం, యాసంగిలో రైతులు వరి పంటే పండించేవారు. నీటి వసతిని బట్టి యాసంగిలో విడతల వారీగా పంటల సాగు ఉండేది. అయితే గత రెండు, మూడేళ్లుగా ప్రతీ యేటా భారీ వర్షాలు కురవడం, చెరువులన్నీ పూర్తిగా నిండి ఉండటం, ఎత్తిపోతల పథకాలు, ఎస్సారెస్పీ నీటితో తరచూ చెరువులను నింపడం వల్ల వానాకాలం కంటే యాసంగిలో  వరి పంట ఎక్కువ సాగు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యాసంగిలో ప్రభుత్వం వరి వద్దని చెబుతుండటం వల్ల చెరువు కట్టకు దూరంగా ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చు. కానీ చెరువు కట్టలకు సమీపంలో ఉన్న రైతుల వ్యవసాయ భూముల్లో నీటి ఊటల కారణంగా నీళ్లు నిల్వ ఉన్నాయి. బురద ఎక్కువగా కన్పిస్తోంది. ఈ భూములు వరి పంట వేయడానికి తప్ప వేరే వాటికి పనికి రావు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 8 లక్షల ఎకరాల భూములను రైతులు పడావుగా ఉంచుతున్నారు. 

16 వేల కోట్ల ఆదాయం కోల్పోతున్న రైతులు
వరి పంట వేయకుండా పడావుగా ఉంచుతున్న భూముల వల్ల ఎకరానికి రూ.20 వేలకు పైగా ఆదాయం కోల్పోతున్నట్లు రైతన్నలు చెబుతున్నారు. దీనివల్ల ఒక్క యాసంగిలోనే చెరువుల కింద భూములన్న రైతులు రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయం కోల్పోతారని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వానాకాలంలో కంటే వేసవి కాలంలో వరి దిగుబడి ఎక్కువగా వస్తుందని, చీడ పురుగుల బెడద అంతగా ఉండదని, పంట పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువ అవుతాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వరి పంట వేయకుండా పడావుగా ఉంచుతున్న భూములకు ఎకరానికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా పడావు భూములను లెక్కించి నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. లేనట్లయితే కనీసం చెరువులు, కుంటల కింద నీళ్లు, బురదమయంగా ఉండే భూములలో వరి పంట వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కట్టి ఏం లాభం
రాష్ట్రంలో మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకతీయ, ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పేరిట లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు చేశారు. వానలు కూడా మంచిగా పడ్డాయి. చెరువుల్లో, ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నీళ్లు ఉన్నాయి. పంట పొలాలకు నీళ్లు అందే సమయం ఇది. అలాంటిది వరి సాగు చేయవద్దని రైతులను గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బంది పెడుతోంది. అలాంటప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు చేసింది ఎందుకు? ‒ కందుల రామకిషోర్, వాజేడు బీజేపీ మండల ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ములుగు జిల్లా