ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'ధురంధర్: ది రివెంజ్' ఇప్పుడు ఓటీటీలో రికార్డులు తిరగరాస్తూ సరికొత్త సంచలనాలకు తెరలేపింది. థియేటర్లలో సాధించిన విజయం ఒక ఎత్తయితే, జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ చిత్రం సృష్టిస్తున్న బీభత్సం మరో ఎత్తు. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించి, థియేట్రికల్ ఓపెనింగ్స్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఫుట్‌ప్రింట్‌తో దూసుకుపోతోంది. ఈ క్రేజీ అచీవ్‌మెంట్‌తో ఇండియన్ ఓటీటీ మార్కెట్‌లో జియోహాట్‌స్టార్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
బాక్సాఫీస్ దాటిన 'ధురంధర్' క్రేజ్..
ఓటీటీలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నఈ చిత్రం భాషా బేధాలు లేకుండా అందరినీ కట్టిపడేసింది. అయితే, దాదాపు 60 శాతం వీక్షణలు కనెక్టెడ్ టీవీ డివైజెస్ ద్వారానే వచ్చాయి. ప్రీమియం కంటెంట్‌ను ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకులకు అందించడంలో జియోహాట్‌స్టార్ సక్సెస్ అయింది. ముఖ్యంగా 'RAW & Undekha' ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది ఆసంస్థ హర్షం వ్యక్తం చేసింది.
వీక్షకులను కట్టడేసిన మూవీ..
కేవలం సినిమా మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన డిజిటల్ ప్రీమియర్ ఫీలింగ్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేసిన వ్యూహం అద్భుతంగా పనిచేసింది. రవెనుక దాగి ఉన్న రహస్యాలు, కాస్ట్ అండ్ క్రూ ఇంటర్వ్యూలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూడని సరికొత్త సీన్స్, బిహైండ్-ది-సీన్స్ విజువల్స్ అభిమానులను మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి.
►ALSO READ | The Odyssey Ticket: ఒక్కో టికెట్ రూ.3,300పైనే.. అయినా నిమిషాల్లో సేల్ అవుట్.. మన హీరోల కన్న పిచ్చ క్రేజ్
గతంలో పార్ట్-1 'ధురంధర్' మొదటి మూడు రోజుల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించగా, ఇప్పుడు పార్ట్-2 ఆ రికార్డులను బద్దలు కొడుతూ 50 మిలియన్లతో నాన్-స్టాప్ ట్రెండింగ్‌లో ఉంది. యాక్షన్, ఎమోషన్, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సాగుతున్న ఈ ప్రతీకార జ్వాల మిమ్మల్ని కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. సినీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
