The Odyssey Ticket: ఒక్కో టికెట్ రూ.3,300పైనే.. అయినా నిమిషాల్లో సేల్ అవుట్.. మన హీరోల కన్న పిచ్చ క్రేజ్

The Odyssey Ticket: ఒక్కో టికెట్ రూ.3,300పైనే.. అయినా నిమిషాల్లో సేల్ అవుట్.. మన హీరోల కన్న పిచ్చ క్రేజ్

అకాడమీ అవార్డు విన్నర్, దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు క్రిస్టోఫర్. ఇపుడీ ఈ దర్శక దిగ్గజం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey). భారీ అంచనాల మధ్య జూలై 17, 2026న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఒక్కో టికెట్ రూ.3,300పైనే..

‘ది ఒడిస్సీ’ సినిమాకు భారత్‌లో భారీ క్రేజ్ కనిపిస్తున్నప్పటికీ, టికెట్ ధరలు అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. IMAX అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ముంబై, పూణే నగరాల్లో కొన్ని ప్రీమియం సీట్ల ధరలు రూ.3,000 నుంచి రూ.3,300 వరకు ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పుణేలో కొన్ని థియేటర్లో అయితే 3400లు ఉంది.

ఒకే సినిమా కోసం నగరాన్ని బట్టి, షో టైమింగ్‌ను బట్టి టికెట్ ధరల్లో భారీ తేడాలు ఉండటంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సినిమా చూడాలా.. లేక విమాన టికెట్ కొనాలా?” అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించాలని అభిప్రాయపడుతున్నారు

అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, ఇంత పెద్ద మొత్తంలో టికెట్ ధరలు ఉన్నప్పటికీ, అభిమానుల ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. ముంబైలో రూ.3,300ల అత్యంత ఖరీదైన టికెట్లు బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజే పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం. ఈ ఒక్క విషయం చాలు.. నోలన్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధమవుతుంది.

►ALSO READ | Manjari Fadnis: ఇంత క్రూరత్వమా? కమ్యూనిటీ డాగ్ని చంపేశారంటూ నటి ఆవేదన..

ఈ క్రమంలోనే ధరలు ఆకాశాన్నంటుతున్నా డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే, ఇది నోలన్ క్రేజ్‌కు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. 

మన హీరోల కన్న పిచ్చ క్రేజ్..
 
ప్రత్యేకంగా IMAX 70mm ఫార్మాట్‌లో సినిమా అనుభవించేందుకు అభిమానులు భారీగా పోటీ పడుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు కనిపించే హడావుడిని మించి, ఈసారి దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పేరు మీదే ప్రేక్షకులు టికెట్లు దక్కించుకునేందుకు క్యూ కట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘ఓపెన్‌హైమర్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘ఇన్‌సెప్షన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో నోలన్ సంపాదించుకున్న క్రేజ్‌కు ఇదే నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా “మన స్టార్ హీరోల సినిమాలకంటే నోలన్ సినిమాలకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇకపోతే, గ్రీకు కవి హోమర్ రాసిన ఇతిహాసం ఆధారంగా ‘ది ఒడిస్సీ’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హాత్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నోలన్, ఎమ్మా థామస్ తమ సొంత బ్యానర్ సింకాపీపై ఈ చిత్రాన్ని నిర్మించారు.