తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్... ఇంట్లో చిన్న గొడవ జరిగిందని పోలీసులకు భర్త ఫిర్యాదు

తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్... ఇంట్లో చిన్న గొడవ జరిగిందని పోలీసులకు భర్త ఫిర్యాదు

మల్కాజ్​గిరి, వెలుగు: నేరేడ్​మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి, ఇద్దరు కుమారులు అదృశ్యమైనట్లు సీఐ వెంకటయ్య తెలిపారు. ఎల్‌‌‌‌బీ నగర్ కాలనీలో నివసించే కుటిక అశోక్ మారేడుపల్లి ఆర్మీ క్యాంటీన్‌‌‌‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యక్తిగత పనులపై గత నెల 29న మియాపూర్‌‌‌‌ వెళ్లగా.. అతని భార్య సబిత(35), ఇద్దరు కుమారులు అభిరామ్ (11), ఆర్య(1)తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 

వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన అశోక్​కు భార్యాపిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇండ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఫోన్ చేస్తే స్విచ్​ఆఫ్ రావడంతో.. ఈ నెల 24న పోలీస్​స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

ఇంట్లో చిన్న గొడవ జరిగిందని, గతంలోనూ ఇలాగే వెళ్లి తిరిగి రావడంతో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.