అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో, సోమవారం మన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. MCX మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఇంట్రాడేలో రూ. 1,43,899 గరిష్ట స్థాయికి చేరి, రూ. 1.44 లక్షల మార్కును తాకింది. కిలో వెండి ధర రూ. 2,217 (సుమారు 1%) పెరిగి రూ. 2,24,500 వద్ద ట్రేడవుతోంది.
గత కొద్ది నెలలుగా తగ్గుతూ పెరిగతు వస్తున్న బంగారం, వెండి.. ఇప్పుడు తొమ్మిది, ఎనిమిది నెలల కనిష్ట స్థాయిల నుంచి గట్టిగా పుంజుకుంటున్నాయి.
ధరలు పెరగడానికి కారణాలు
దాదాపు రెండు వారాలుగా నడుస్తున్న అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శత్రుత్వం కాస్త శాంతించింది. శుక్రవారం రాత్రి నుంచి రెండు దేశాలు దాడులు ఆపేసి, ఒమన్ దేశం ద్వారా ఇరాన్ చర్చలు జరుపుతోంది. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 6% తగ్గాయి. దింతో డబ్ల్యూటీఐ క్రూడ్ $85, బ్రెంట్ క్రూడ్ $93 కంటే తక్కువకు పడిపోయాయి.
బుధవారం జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం రానుంది. కొద్దిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఈసారే రేట్లు పెంచుతారనే అంచనాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం వరకు సప్లయ్ దెబ్బతినడంతో గతంలో ధరలు తీవ్రంగా ఊగిసలాడాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం వైపు పెట్టుబడిదారుల చూపు పడింది.
ఈరోజు సోమవారం (27 జులై) 1 గ్రాము 24 క్యారెట్ల ధర రూ.93 పెరిగి రూ.14,586 చేరగా, 22క్యారెట్ల ధర రూ. 85 ఎగిసి రూ.13,370కి పెరిగింది. ఇక 18 క్యారెట్ల ధర రూ.69 పెరిగి రూ.10,939
దింతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.930 పెరిగి రూ.1,45,860 పెరిగింది. 22క్యారెట్ల ధర రూ.850 పెరిగి రూ.1,33,700 చేరగా.. 18 క్యారెట్ల ధర రూ. 690 పెరిగి రూ.1,09,390.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో ధరలు చూస్తే :
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 24 క్యారెట్ల ధర రూ.1,45,860, 22క్యారెట్ల ధర రూ.1,33,700, 18 క్యారెట్ల ధర రూ.1,09,390.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 24 క్యారెట్ల ధర రూ.1,45,860, 22క్యారెట్ల ధర రూ.1,33,700, 18 క్యారెట్ల ధర రూ.1,09,390.
ఇక వెండి ధర ఈ రోజు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. దింతో 1 గ్రాము ధర రూ.240 ఉండగా.. కిలో వెండి ధర రూ.2,40,000
