ప్రస్తుత రోజుల్లో హిందువులే కాదు.. అన్ని మతాల వారు వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతా బాగున్నా చాలామంది ఇళ్లల్లో ఏదో ఒక ఇబ్బంది పడుతుంటారు. ఇంటిలో సమస్యలు, కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇలా అనేకరకంగా కష్టాలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అన్ని సమస్యలు తొలిగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు..
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే.. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నా.. వాస్తు అంతా సరిగ్గా ఉన్నా.. ఇబ్బందులు తప్పవు. అలాంటి వారి ఇళ్లలో కచ్చితంగా ప్రతికూల శక్తి ఉంటుంది. ప్రతి కూల శక్తి తాండవం చేస్తే ఆ ఇంట్లో ఉండే వారు మానసికంగా ఇబ్బంది పడుతుంటారు.
వాస్తుశాస్త్రం ప్రకారం.. నిమ్మకాయ ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. అందుకే చాలామంది వారంలో ఒక రోజును నియమంగా పెట్టుకొని ప్రధాన గుమ్మం దగ్గర మూడు నిమ్మకాయలను ఒక దారానికి గుచ్చి కడతారు. ఇంట్లోకి ప్రతికూల శక్తి రాదని నమ్ముతుంటారు. ఉన్న ప్రతికూల శక్తిని నిమ్మకాయ గ్రహిస్తుందని వాస్తు శాస్త్రవ ద్వారా తెలుస్తుంది.
వాస్తు శాస్త్రంలో నిమ్మకాయ ప్రతి కూల శక్తిని చాలా త్వరగా గ్రహిస్తుంది అంటారు. అంతే కాకుండా ఇది ఆప్రాంతంలోని నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి బయటకు పంపుతుంది. నిమ్మకాయకు అంతటి శక్తి ఉండటం వలన గుమ్మం దగ్గర కడతారు. ఇలా చేయడం వలన జీవితంలో సమస్యలు త్వరగా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలతో సతమతం అయ్యేవారు తప్పకుండా నిమ్మకాయలను పూజించి.. హారతి.. ధూపం ఇచ్చి తరువాత వీటిని గుమ్మం దగ్గర కట్టాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
ఇంటిని నీళ్లతో శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో రెండు చుక్కలు నిమ్మరసం.. కొద్దిగా ఉప్పు కలిపి క్లీన్ చేయడం వలన మూలల్లో ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇలా వారానికి ఒకసారి నియమం పెట్టుకొని ఇంటిని తుడవడం కష్టాలకు పరిష్కారం లభిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇలా చేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగి అంతా శుభమే జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు తగ్గిపోవడం, అన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం, లక్ష్మీదేవి మీ ఇంటిలో కొలువై ఉండటం జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
