సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత..

సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత..

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ( జులై 28 ) హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్థరాత్రి 1:52 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో పావలా శ్యామల మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు.

ప్రస్తుతం ఆమె భౌతిక ఖాయాన్ని ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో బతుకు పోరాటం సాగిస్తున్నారు పావలా శ్యామల. ఆమెతో పాటు కూతురు ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన పావలా శ్యామల చివరి రోజుల్లో ఇలాంటి దయనీయ స్థితిలో తనువు చలించడం చిత్ర పరిశ్రమను అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.