ఏపీలో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. మున్సిపల్,పరిషత్ పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అలాగే అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 రోజులలో విడతలవారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులకు తెలిపింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి,ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహించనున్నారు. చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
