జ్యోతిష్యం: శని భగవానుడి అనుగ్రహం.. 132 రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ పిరియడ్

జ్యోతిష్యం: శని భగవానుడి అనుగ్రహం.. 132 రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ పిరియడ్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో టైం లో ఒక్కోరాశికి .. ఆయా గ్రహాల సంచారం ఆధారంగా గోల్డెన్​ టైం వస్తుంది.. ప్రస్తుతం శని భగవానుడు 132 రోజుల పాటు నాలుగు రాశులకు విశేషమమైన యోగం కలుగజేయనున్నాడు.  దీనివలన ఆ రాసుల వారికి గోల్డెన్​ పిరియడ్​ నడుస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం...!

మిథునరాశి:  శని దేవుడి అనుగ్రహం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది.  ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి బాగా అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా జూలై ఆఖరు లోగా అనుకోని విజయాలు లభించే అవకాశం ఉంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండాఆర్డర్లు  లభిస్తాయి.  ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు  అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కష్టాలు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా ఉంటారు. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కష్టాలు అనుభవిస్తున్నారో, వారి కష్టాలు అన్నీ కూడా తొలిగిపోతాయి. కోరుకున్నది జరిగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కన్యారాశి : శని భగవానుడు ఆశీస్సులు ఈ రాశి వారికి పుష్కలంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు.  ఈ రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విగృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు.  అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి శని అనుగ్రహం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి సుఖ స్థానంలో శని ఉండటం వలన వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. చేతినిండా డబ్బే ఉంటుంది. డబ్బుకు కొదవే ఉండదు.  కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. అతి కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. వీరికి అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

ధనస్సు రాశి : ఈరాశి వారికి ధన పరంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. వీరు తీసుకున్న నిర్ణయాలతో లైఫ్​ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి.  ధన ప్రవాహం పెరుగుతుంది. సంపదకు కొదవ ఉండదు.  శని భగవానుడి అనుగ్రహం వలన  ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.చాలా అద్భుతంగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.