
టాలీవుడ్ నటుడు శివాజీ(Shivaji), తొలిప్రేమ మూవీ ఫేమ్ వాసుకీ ఆనంద్ సాయి(Vasuki Anandsai) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్(#90's A Middle Class Biopic). మౌళి, వాసంతిక, రోహన్ రాయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఈరోజు (జనవరి 5) నుండి ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న శివాజీ ఈమేరకు మెప్పించారు?ఈ సిరీస్ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
చంద్రశేఖర్( శివాజీ) గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టారు. అతనికి భార్య రాణి( వాసుకీ ఆనంద్ సాయి), ముగ్గురు పిల్లలు రఘు( మౌళి తనూజ్ ప్రశాంత్), దివ్య ( వాసంతిక), ఆదిత్య( రోహన్ రాయ్). తాను పనిచేస్తుంది గవర్నమెంట్ స్కూల్లో అయినప్పటికీ.. పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్లో చెదివిస్తాడు. అక్కడ రఘుకి సుచిత్ర(స్నేహాల్ కామత్) పరిచయం అవుతుంది. మొదటిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. చదువు మానేసి ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. కానీ, రఘు పేరెంట్స్ మాత్రం అతను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడని కళలు కంటూ ఉంటారు. మరి రఘు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడా? అతని ప్రేమను సుచిత్ర ఒప్పుకుందా? ఇంతకీ ఉప్మా కథ ఏంటి? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
90స్ కిడ్స్ వారికి ఈ సిరీస్ ఒక మెమరీస్ రీ కలెక్షన్ లాగా అనిపిస్తుంది. ఆ కాలంలో తాను అనుభవించిన అనుభవాలన్నింటినీ దర్శకుడు ఈ కథలో నింపేశాడు. ఆ కాలం వారు ఈ సిరీస్ కు చాలా బాగా కనెక్ట్ అవుతారు. చాలాసార్లు నేను కూడా ఇలా చేశాను అని ఫీలవుతారు. అంత సహజంగా ఈ సిరీస్ కథను డిజైన్ చేశారు. అప్పటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, వారి ఆలోచనలు, ఆర్థిక పరిస్థితులు, గొడవలు ఇలా చాలా అంశాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కథలో కొత్తదనం లేకపోయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా సహజంగా ఉంది. అదే ఈ సిరీస్ లో కొత్తదనం కూడా. అందుకే ఈ సిరీస్ ను చూసి ఎంటర్టైన్ అవ్వాలి అంతే.
నటీనటులు:
90's సిరీస్ కు ప్రధాన బలం అంటే శివాజీ, వాసుకీ అనే చెప్పాలి. ఆపాత్రల్లో వాళ్ళు నటించారు అనేకంటే జీవించారు అనడం ఉత్తమం. మధ్య తరగతి కుటుంబ పెద్దగా శివాజీ అద్భుతంగా నటించారు. ఆయన పాత్ర సిరీస్ కు హైలెట్ గా నిలిచింది. ఇక ఇల్లాలి పాత్రలో వాసుకీఒదిగిపోయారు. తన అద్భుతమైన నటనతో సిరీస్ ను నిలబెట్టారు. ఇక వాళ్ళ పిల్లల పాత్రల్లో మౌళి తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్‌లు కూడా ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా మౌళి తనూజ్ ప్రశాంత్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. యూట్యూబర్ గా పరిచయమైన మౌళి ఈ సిరీస్ లో తన మార్క్ ను చూపించాడు. ఈ సిరీస్ తరువాత అతనికి మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన వారు కేసుల తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక విభాగం :
90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కి తన సంగీతంతో ప్రాణం పోశారు సురేష్ బొబ్బిలి. ఆయన నేపథ్యం సంగీతం సిరీస్ ను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టింది. సినిమాలోని ఎమోషన్ ని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ అజీమ్ మహ్మద్ కెమెరా వర్క్ అద్భుతమని చెప్పాలి అలనాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఇక ఎడిటింగ్ విషయంలో శ్రీథర్ సోమ్‌పల్లి తన మార్క్ ను చూపించారు. సిరీస్ కు ఏది అవసరమో అది పర్ఫెక్ట్ గా సెట్ చేశారు.
ఇక 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. 90's వారికి ఈ సిరీస్ ఒక మెమరీస్ ఆల్బమ్ లాంటిది.