ఫ్యాన్స్ ముందుకు రావడంలో మార్పు వచ్చింది.. కొట్టే టార్గెట్లో మార్పు లేదు: రవితేజ

ఫ్యాన్స్ ముందుకు రావడంలో మార్పు వచ్చింది.. కొట్టే టార్గెట్లో మార్పు లేదు: రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) ఈగల్‌ (Eagle)మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో ఉంటుందనుకున్న ఈ సినిమా అనుహ్యంగా రేసు నుంచి తప్పుకోవడంతో ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. 

లేటెస్ట్గా ఈగల్‌ వాయిదా పడటంపై రవితేజ స్పందించారు. 'మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తున్న..సినిమా ఫ్యాన్స్ ముందుకు రావడంలో మార్పు వచ్చింది కానీ, కొట్టే టార్గెట్లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 9న రిలీజ్ మాస్ ఈగల్ కోసం సిద్ధంగా ఉండండి తమ్ముళ్లు' అంటూ ట్వీట్ చేశారు.

 

ప్రస్తుతం రవితేజ ఈగల్ సినిమాపై తీసుకున్న..గొప్ప నిర్ణయానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క హీరో సైతం ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటే తెలుగు పరిశ్రమ బాగుంటుందని సినిమా పెద్దలు మాట్లాడుకుంటున్నారు. 

ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే..కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రవితేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించగా..న‌వ‌దీప్ కీల‌క పాత్ర పోషించాడు. ముందుగా ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్.