రజనీకాంత్కు గుడికట్టిన అభిమాని.. ప్రతిరోజు పూజలు

రజనీకాంత్కు గుడికట్టిన అభిమాని.. ప్రతిరోజు పూజలు

హీరోలంటే ఏ చాలామందికి చెప్పలేనంత అభిమానం ఉంటుంది. అందులో కొంతమంది వాళ్ల స్టైల్‌ని ఫాలో అవుతూఉంటారు, మరికొందరు వాళ్ల పేరుపై సేవాకార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కొంతమంది వారి సినిమాలను ఎగబడి మరీ చూస్తారు. ఇలా ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు తమ అభిమాన హీరోపై ప్రేమను చూపిస్తూ ఉంటారు. 

ఇక ఆ అభిమానం కాస్త ఎక్కువైతే తమ అభిమాన హీరోను దైవంలా భావిస్తారు. అంతేకాదు కొంతమందికి హీరోలు, హీరోయిన్స్ కు గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఒక అభిమాని కూడా తన అభిమాన హీరోకు గుడి కట్టి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth).    

Also Read :- నవంబర్ 11న.. దీపావళి

తమిళనాడులోని మధురైకి చెందిన కార్తీక్ అనే వ్యక్తికి రజనీకాంత్ అనే చాలా అభిమానం. అందుకే ఆయనకు గుడి కట్టేశాడు. ఆ గుడిలో రజినీకాంత్ విగ్రహంతో పాటు.. తన తల్లిదండ్రుల ఫోటోలు, గణేశుని ఫోటోను ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.