Aakasamlo Oka Tara OTT Deal: థియేటర్లలోకి రాకముందే స్టార్ హీరో మూవీ బడ్జెట్ రికవరీ? 'ఆకాశంలో ఒక తార' OTT డీల్ ఎంతంటే?

Aakasamlo Oka Tara OTT Deal: థియేటర్లలోకి రాకముందే స్టార్ హీరో మూవీ బడ్జెట్ రికవరీ? 'ఆకాశంలో ఒక తార' OTT డీల్ ఎంతంటే?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు, చేసే ప్రయోగాలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఇప్పుడు అదే అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ మంచి ఫీల్‌గుడ్ వైబ్స్‌తో పాటు ఓ స్ఫూర్తిదాయకమైన కథను చూడబోతున్నామనే ఆసక్తిని పెంచింది.  అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కుల డీల్ గురించి వినిపిస్తున్న వార్త ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. 'ఆకాశంలో ఒక తార' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషలకు కలిపి సుమారు రూ.60 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ నిజమైతే, సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు భారీ ఆర్థిక భరోసా లభించినట్లే. అంతేకాదు, ఓటీటీ హక్కుల ద్వారానే సినిమా నిర్మాణ వ్యయాన్ని రికవరీ చేసిందనే టాక్ కూడా మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈ డీల్‌కు సంబంధించిన వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కథ విషయానికి వస్తే.. ఓ యువతి వ్యోమగామి కావాలనే కలను నిజం చేసుకునేందుకు ఎదుర్కొనే అడ్డంకులు, ఆమె ప్రయాణానికి అండగా నిలిచే వ్యక్తుల చుట్టూ సినిమా సాగనున్నట్లు టీజర్ సూచిస్తోంది. సమాజంలోని పరిమితులను దాటి ఆకాశాన్ని అందుకోవాలనే ఆశయం కథకు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.

ALSO READ : The Prompt War : పురాణాలు, ఏఐ టెక్నాలజీతో బాక్సాఫీస్‌పై యుద్ధం..

దర్శకుడు పవన్ సాదినేని ఈ కథను భావోద్వేగాలతో ఎలా తెరకెక్కించారన్నది ఆసక్తికరంగా మారింది. సాత్విక వీరవల్లి అరంగేట్రం, శ్రుతి హాసన్ కీలక పాత్ర, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. గున్నం గంగరాజు కథా, స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. లైట్‌బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతున్న 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో  చూడాలి.