The Prompt War : పురాణాలు, ఏఐ టెక్నాలజీతో బాక్సాఫీస్‌పై యుద్ధం.. 'ది ప్రాంప్ట్ వార్'తో సరికొత్త ప్రయోగం!

The Prompt War : పురాణాలు, ఏఐ టెక్నాలజీతో బాక్సాఫీస్‌పై యుద్ధం.. 'ది ప్రాంప్ట్ వార్'తో సరికొత్త ప్రయోగం!

భారతీయ పురాణాలు.. అంతుచిక్కని రహస్యాలు.. ఊహలకు అందని ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. ఈ మూడు అంశాలను కలిపి వెండితెరపై ఓ సరికొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది ఆర్విహా క్రియేషన్స్. తమ తొలి చిత్రంగా రూపొందిస్తున్న 'ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్' టైటిల్‌ను 2026 దసరా సందర్భంగా ప్రకటించి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. లేటెస్ట్ గా విడుదలైన టైటిల్ పోస్టర్‌తో ఈ సినిమా ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోందనే చర్చ మొదలైంది.

సాధారణ కథలకు భిన్నంగా మైథాలజీ, మిస్టరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ముఖ్యంగా 'రైజ్ ఆఫ్ మహావీర్' అనే ఉపశీర్షిక కథలోని కీలక పాత్ర చుట్టూ ఏదో బలమైన రహస్యం దాగి ఉందనే ఆసక్తిని పెంచుతోంది. పురాణాల్లోని శక్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తును తలపించే కథా ప్రపంచం.. ఇవన్నీ సినిమాలో ఎలా కలుస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏఐ నేపథ్యంలో సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న తరుణంలో, భారతీయ పురాణాల స్ఫూర్తితో ఈ తరహా కథను తెరకెక్కించడం వినూత్న ప్రయత్నంగా నిలవనుంది. విజువల్ ఎఫెక్ట్స్, 3డీ అనుభూతికి ప్రాధాన్యం ఇస్తే ప్రేక్షకులకు కొత్త తరహా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించే అవకాశం ఉంది.

ALSO READ : Annayya Paanamlo Song: మాస్ హీరోలో ఈ ఎమోషనల్ యాంగిల్ చూశారా?

నిర్మాత నరేష్ గౌడ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రసన్న కొత్వాల దర్శకత్వం వహిస్తున్నారు. జి.సి. శేఖర్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 3డీ వెర్షన్‌తో సహా ఈ సినిమాను 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి పోస్టర్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన 'ది ప్రాంప్ట్ వార్'.. కథ, విజువల్స్‌తోనూ అదే స్థాయి సంచలనం సృష్టిస్తుందా? అన్నది వేచి చూడాలి..