సంసార జీవితం ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చజరుగుతుంటాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో జయం రవి మాజీ భార్య ఆర్తి రవి చేసిన ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
అసలు ఉద్దేశం ఎవరిపై?
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం ఇప్పటికే కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీనికి నటి త్రిషతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ఆమె పేర్కొన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంపై ఆర్తి రవి స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక భార్య గౌరవం గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా ఉంది. భర్త బహిరంగంగా మరొకరితో తిరుగుతుంటే, ఆ భార్య పడే మానసిక వేదనను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు.. అది మంచిదే అంటూ ఎవరి పేర్లను ప్రస్తావించకుండా రాసుకొచ్చారు.
భార్య పట్ల చూపే సానుభూతి ఇదేనా?
అయితే, ఇక్కడే ఆమె ఒక సూటి ప్రశ్న వేశారు. గతేడాది సరిగ్గా ఇలాంటి పరిస్థితే నా జీవితంలో ఎదురైనప్పుడు ఇంతలా ఎవరూ స్పందించలేదేంటి? అప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు సరే.. పైగా నాపై అబద్ధపు ప్రచారాలు చేశారు. ఒక భార్య పట్ల చూపే సానుభూతి అనేది ఆ భర్తకున్న 'మార్కెట్ వాల్యూ' లేదా 'పొలిటికల్ పవర్' మీద ఆధారపడి ఉంటుందా?" అని ఆమె నిలదీశారు. ఇక్కడ ఆర్తి రవి ఎవరి పేర్లు పేర్కొన్నకపోయినా.. ఆమె మాటలను బట్టి అది విజయ్ విడాకుల వివాదం గురించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
►ALSO READ | రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే?
విజయ్ - త్రిష వర్సెస్ రవి - కెనీషా
ఆర్తి పోస్ట్‌లోని అంతరార్థాన్ని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2024లో రవి తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో కలిసి ఒక వివాహ వేడుకలో మ్యాచింగ్ డ్రస్సుల్లో కనిపించడం పెను దుమారం రేపింది. ఇప్పుడు విజయ్ కూడా త్రిషతో కలిసి ఒకే రకమైన దుస్తుల్లో బహిరంగంగా కనిపించడం, అదే సమయంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేయడం ఒకేలా ఉన్నాయని నెటిజన్లు పోలుస్తున్నారు.
నెటిజన్ల రియాక్షన్
ఆర్తి చేసిన ఈ పోస్ట్ ముఖ్యంగా విజయ్ రాజకీయ ఎంట్రీని ఉద్దేశించిందని కొందరు భావిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే, ఈ అఫైర్ గురించి ఇంతలా చర్చ జరిగేది కాదు అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆర్తి చేతిపై ఉన్న రవి పేరు ట్యాటూను తొలగించి, త్వరగా విడాకుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆమెకు ధైర్యం చెబుతున్నారు. సెలబ్రిటీ హోదా ఉన్నా లేకపోయినా, ఒక భార్యకు దక్కాల్సిన కనీస గౌరవం, సానుభూతి అందరికీ సమానంగా ఉండాలని ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
