
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం వరల్డ్ లోనే బెస్ట్ బౌలర్లలో ఒకడు. టెస్టుల్లో నెంబర్ ర్యాంక్ లో దూసుకెళ్తున్న ఈ టీమిండియా పేసర్.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇప్పటికే తనదైన మార్క్ వేశాడు. తన బౌలింగ్ తో 2024 టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. భారత జట్టుకు ఫార్మాట్ ఏదైనా బుమ్రా కీలక బౌలర్. ఈ గుజరాత్ పేసర్ జట్టుకు దూరమైతే ఆ మ్యాచ్ లో భారత బౌలింగ్ బలహీనంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లోనూ బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడడం లేదు. వెన్ను గాయం కారణంగా తాను మూడు టెస్టులు మాత్రమే అడగలనని ఇప్పటికే చెప్పుకొచ్చాడు.
ALSO READ | MS Dhoni: 'మిస్టర్ కూల్' ట్యాగ్‌పై ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకున్న ధోనీ
జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలని గిల్ సేన గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. అయితే రెండో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉండడం లేదు. అధికారిక ప్రకటన రాకపోయినా బుమ్రా రెండో టెస్టుకు దూరమవ్వడం దాదాపుగా ఖాయమైంది. దీంతో భారత పేస్ బౌలింగ్ దళం బుమ్రా లేని లోటును ఎలా తీరుస్తుందనేది ఆందోళనగా మారింది. కెరీర్ లో ఎన్నో సార్లు గాయాల బారిన పడిన ఈ నెంబర్ వన్ బౌలర్.. ఈ క్రమంలో ఎన్నో కీలక టోర్నీలకు దూరమయ్యాడు. బుమ్రా వర్క్ లోడ్ పై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ కీలక సలహా ఇచ్చాడు.
డివిలియర్స్ తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ.. " బుమ్రా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అతనికి విశ్రాంతి ఇవ్వడం చాలా కష్టం. కానీ నా అభిప్రాయం ప్రకారం, టెస్ట్ క్రికెట్ అత్యంత ముఖ్యమైనది. ఇంగ్లాండ్ తో కీలక సిరీస్ కు బుమ్రా అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండాల్సిన సిరీస్. స్టెయిన్ విషయంలో మేము అలాగే చేసేవాళ్ళం. అంతగా ప్రాముఖ్యత లేని టీ20, వన్డేల్లో అతనికి రెస్ట్ ఇచ్చి టెస్టుల్లో రెగ్యులర్ గా ఆడించేవాళ్ళం. బుమ్రాను అలాగే చేయండి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియాలో జరిగే పెద్ద టెస్ట్ సిరీస్‌లకు అతన్ని సిద్ధం చేయండి". అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
AB de Villiers urges India to manage Jasprit Bumrah like South Africa did with Dale Steyn! pic.twitter.com/8ykJEIHVHl
— CRICKETNMORE (@cricketnmore) June 30, 2025