
గతేడాది నుండి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్లు విడిపోతున్నారనే రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ ఉన్నాయి. ఈ రూమర్స్పై ఎవ్వరూ తమ నోరు విప్పలేదు. లేటెస్ట్గా తమ విడాకుల పుకార్లపై అభిషేక్ బచ్చన్ మౌనం వీడారు.
‘ఒకప్పుడు తనపై ఎలాంటి ట్రోల్స్ వచ్చిన ఇబ్బంది పడలేదు. కానీ, ఇప్పుడు నాకొక ఫ్యామిలీ ఉంది. నాపై, నా ఫామిలీపై తప్పుడు ప్రచారాలు చేస్తుండటం చాలా బాధాకరం. ఎవ్వరైతే రూమార్స్ క్రియేట్ చేస్తారో.. వారు తమ మనస్సాక్షితో వ్యవహరించాలి. క్రియేట్ చేసిన న్యూస్కు వారే సమాధానం చెప్పాలి. అంతేగానీ, నేను కాదని ' అభిషేక్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ క్రమంలో తమపై వస్తోన్న ప్రతికూల వార్తలు తనను మరియు తన కుటుంబాన్ని బాగా కుంగదీశాయని’అభిషేక్ అన్నారు. దీంతో వీరిద్దరు కలిసే ఉన్నారని అభిషేక్ లేటెస్ట్ కామెంట్స్ బట్టి అర్ధమవుతుంది. మరి ఇకనైనా, నెటిజన్లు తమ రూమర్స్కు చెక్ పెడతారో లేదో చూడాలి.
►ALSO READ | Manchu Vishnu: 30వేలకి పైగా పైరసీ సైట్లలో కన్నప్ప.. ‘హార్ట్ బ్రేకింగ్’ అంటూ మంచు విష్ణు ట్వీట్
గత కొంత కాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకకు ఇద్దరూ విడివిడిగా రావటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అలాగే, ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్‌తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. దీంతో అభిషేక్, ఐశ్వర్య విడిపోవటం నిజమే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
ఇకపోతే, అభిషేక్ బచ్చన్ త్వరలో "కాళిధర్ లాపాట" మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ జూలై 4న Zee5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కాళీధర్ పాత్రలో నటిస్తున్నాడు. అతను తన జీవితంలో ఒక దశలో కోల్పోయినట్లు భావించి, దాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఉంటాడు. మధుమిత దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దైవిక్ బఘేలా కీలక పాత్రలో నటించనున్నారు.
Life gives us plot twists when we least expect them.#KaalidharLaapata premieres 4th July, only on #ZEE5. #KaalidharLaapataOnZEE5@Mdzeeshanayyub #DaivikBaghela @memadhumita @monishaadvani @madhubhojwani @nikkhiladvani #UmeshKrBansal @DeshmukhPragati @amitoshnagpal… pic.twitter.com/otBuSM0zPC
— Abhishek 𝐁𝐚𝐜𝐡𝐜𝐡𝐚𝐧 (@juniorbachchan) June 28, 2025