ఎండాకాలం కదా.. రూ.30 వేల రూపాయల్లో ఏసీ ఆఫర్స్

ఎండాకాలం కదా.. రూ.30 వేల రూపాయల్లో ఏసీ ఆఫర్స్

ఎండాకాలం వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.. ఇంట్లో ఉన్నా ఉక్కపోత, చెమటలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. ఫ్యాన్లు, కూలర్లతో కొంత ఉపశమనం ఉన్నా.. చాలా మంది ఏసీలను కొనుగోలు చేస్తుండటంతో డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్లు .. స్ప్లిట్ ఏసీల కొనుగోలుకు అపరిమితమైన డీల్స్ తో అనేక ఆఫర్లను అందిస్తున్నాయి. పరిమితమైన ఈ డీల్స్ తో రూ. 1286 ల EMI చెల్లించి ఏసీని సొంతం చేసుకోవచ్చు. 

ఇండియా మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ ల నుంచి కొన్ని ఏసీలు ఈ-కామర్స్ పోర్టల్ లో మంచి తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉన్నాయి.. వాటి గురించి తెలుసుకుందాం.. 

Voltas  స్ల్పిట్ AC 1.4 టన్ 

రూ. 30,990 ధరతో ఈ స్ప్లిట్ ఏసీని రూ. 1502 EMI వద్ద ఈ-కామర్స్ పోర్టల్ నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు డిస్కౌంట్ ద్వారా రూ. 2వేల వరకు అదనపు తగ్గింపు వర్తిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే AC  విత్ రిమోట్ కంట్రోల్, ఇన్వర్టర్ కంప్రెసర్, డస్ట్ ఫిల్టర్ తో ఈ Voltas స్ప్లిట్ అందుబాటులో ఉంది. 

గోద్రెజ్ 1.5 టన్ 3 స్టార్AC

గోద్రెజ్ 1.5 టన్ 3 స్టార్ AC.. డిస్కౌంట్ తర్వాత రూ. 30,990(అసలు ధర రూ. 45,400) కి లభిస్తుంది. 1.5 లీటర్ 5ఇన్ 1 కన్వర్టబుల్ స్ల్పిట్ AC 40 శాతం నుంచి 110 శాతం వరకు కూలింగ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. 52 డిగ్రీల సెల్సియస్ పరిసర ఉష్ణోగ్రతతో ఈ AC 3 స్టార్ రేటింగ్, 1 సంవత్సరం ప్రాడక్ట్ గ్యారెంటీ, PCB పై 5 సంవత్సరాల వారంటీ, కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీని ఉటుంది. 

Lloyd 1.5 Ton 3 Star AC 

Amazon  లో దీని ధర రూ. 32,990 (అసలు ధర రూ. 58,990). 3 స్టార్ స్ప్లిట్ AC. 1  సంవత్సరం ప్రాడక్ట్ వారెంటీ, 5 సంవత్సరాల కాంపోనెంట్ (PCB) వారంటీ, కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. 

ఫీచర్ల విషయానికొస్తే.. ఈ 5ఇన్ 1 కన్వర్టబుల్ AC , క్లీన్ ఎయిర్ ఫిల్టర్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, 4 మీటర్ల లాంగ ఎయిర్ త్రో, టర్బోకూల్, తక్కువ గ్యాస్ డిటెక్షన్, క్లీన్ ఫిల్టర్ ఇండికేషన్, ఇన్ స్టాటేషన్ చెక్,52 డిగ్రీల ఉష్ణోగ్రత అంత వేడిగా ఉన్నప్పటికీ స్పేస్ ను కూల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. 

Also Read : ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్