కరెంటు మీటర్ల పేరుతో రూ. లక్షా 20 వేలు లంచం...ఏసీబీకి పట్టుబడ్డ TGSPDCL ఏఈ రాకేష్ 

కరెంటు మీటర్ల పేరుతో రూ. లక్షా 20 వేలు లంచం...ఏసీబీకి పట్టుబడ్డ TGSPDCL ఏఈ రాకేష్ 

కరెంటు మీటర్ల పేరుతో రూ. లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు మాదన్నపేట ఏఈ రాకేష్. గురువారం ( అక్టోబర్ 15 ) సంతోష్ నగర్ లో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఏఈ రాకేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. TGSPDCL లో మదన్నపేట ఏఈగా పని చేస్తున్న రాకేష్ కరెంటు మీటర్ల కోసం రూ. లక్షా 20 వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సంతోష్ నగర్ లోని TGSPDCL ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏఈ రాకేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ALSO READ : బీజేపీ మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన జనం

నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు శుక్రవారం ( అక్టోబర్ 16 ) కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.