సముద్రతీరం..మేఘాల మెరుపుల మధ్య.. నిఖిల్ కత్తిసాము

సముద్రతీరం..మేఘాల మెరుపుల మధ్య.. నిఖిల్ కత్తిసాము

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల  కార్తికేయ 2తో(Karthikeya 2) పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన స్పై(Spy) మూవీతో ఆడియన్స్ను కాస్త డిసప్పాయింట్ చేశాడు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో పాటు చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఈ యంగ్ హీరో నుంచి వస్తోన్న..మరో క్రేజీ అండ్ పీరియాడిక్  మూవీ స్వయంభూ(Swayambhu).ఈ సినిమా ఫస్ట్లుక్ లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి కత్తి సాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మేకర్స్ షేర్ చేశారు. వియాత్నంలోని సముద్ర తీరంలో ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియోకు..ప్రకృతి మాత ఆశీర్వాదానికి చిహ్నం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. తనదైన మార్క్ స్టైల్లో నిఖిల్ కత్తిని తిప్పుతుండగా..సూపర్ డెడికేషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

నిఖిల్ స్వయంభూ కోసం వియత్నాంలో నెల రోజులు స్పెషల్ ట్రైనింగ్‌‌ తీసుకుంటున్నాడు. అక్కడ  ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సైగాన్‌‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌‌లు యాక్షన్ సీక్వెన్స్‌‌ల కోసం నిఖిల్‌‌కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో తను ఒక యోధునిగా కనిపించడం కోసం ఫిజికల్‌‌గానూ మేకోవర్ అవుతున్నాడు.

నిఖిల్ నటిస్తున్న 20వ చిత్రమిది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి  భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. కేజిఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.