Ashika Ranganath: ఆషిక ఫిట్నెస్ అందాలు..విశ్వంభర కోసం తీవ్ర కసరత్తులు!

Ashika Ranganath: ఆషిక  ఫిట్నెస్ అందాలు..విశ్వంభర కోసం తీవ్ర కసరత్తులు!

కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషిక రంగ‌నాథ్ (Ashika Ranganath) తెలుగు తెరపై నాగార్జున సరసన నా సామి రంగ చిత్రంలో వరాలు అనే పాత్ర చేసి అదరగొట్టేసింది. అమిగోస్లో కళ్యాణ్​ రామ్తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వర్కౌట్ చేసే వీడియోను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. బ్యాక్ ఇన్ యాక్షన్..నిజమైన వర్కౌట్స్ సెషన్ అంటే ఏంటో తన ట్రైనర్ గుర్తు తెస్తారని క్యాప్షన్ ఇచ్చింది.ఈ వీడియో చూస్తున్నంతసేపు చేస్తున్న ఆషికకు ఏమో గానీ..మనకు టెన్షన్ అయితే వచ్చేస్తుంది.  

ఈ వీడియోలో టైట్ జిమ్ వేర్ వేసుకున్న ఆషిక రంగ‌నాథ్..ప్రతీ ఒక్క ఎక్విప్ మెంట్తో తనదైన పంథాలో వర్కౌట్స్ చేసింది.తగ్గేదేలే అంటూ చేస్తున్న ఈ కసరత్తులు వెనుక ఏదో బలమైన సినిమా పడిందనే టాక్ వినిపిస్తోంది. 
జిమ్లో కసరత్తులు చేస్తూనే మధ్యలో క్యూట్గా నవ్వుతూ రిలాక్స్ అయింది. ఆషిక వర్కౌట్స్ చూసి నెటిజన్లు..వాట్ ఏ డెడికేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర లో ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉంటారట. అందులో ఒక పాత్ర కోసం ఆషిక రంగ‌నాథ్ ను చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.