డార్లింగ్ ప్రభాస్ కోసం థియేటర్‌కు వెళ్తా.. కానీ ఆ ఛాన్స్ వస్తే నో చెప్పేస్తా!

డార్లింగ్ ప్రభాస్ కోసం థియేటర్‌కు వెళ్తా.. కానీ ఆ ఛాన్స్ వస్తే నో చెప్పేస్తా!

టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. శీను, సముద్రం, వెంకీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది.  పెండ్లి తర్వాత కొ న్నేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాశి పలు చిత్రాలతో పాటు సీరియల్లో కూడా కనిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తి విషయాలు పంచుకుంది. 

ప్రభాస్ అంటే ఇష్టం.. కానీ.

ప్రభాస్ అంటే తనకు ఇష్టమని, కానీ ఆయనకు తల్లిగా నటించనని చెబుతోంది రాశి. ప్రభాస్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలనే ఆశ చాలా ఏండ్లుగా ఉండిపోయింది. ప్రస్తుత పరిస్థితిల్లో చాన్స్ వచ్చినా తల్లిగా మాత్రం నటించను, ఆపై అక్క, వదిన వంటి పాత్రలు వచ్చినా చేయను అని చెప్పింది. హీరోయిన్ గా నటించే అవకాశం ఎలాగూ ఇవ్వరు కదా. దీంతో నా కోరిక అలాగే ఉండిపోయింది అని తెలిపింది.

►ALSO READ | మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్.. రామ్ చరణ్‌కు గాయం.. 'పెద్ది' షూటింగ్‌లో ఏం జరిగిందంటే?

హీరో కోసం..

ఈశ్వర్ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని నా బ్రదర్ తో చెప్పానని రాశి తెలిపింది. ఆయన మూవీస్ చూడటానికి మాత్రమే థియేటర్ కు వెళ్తా. మిర్చి, రాధే శ్యామ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్లు గుర్తిచేసింది.. 'అడవి రాముడు' షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్లోనే నేను కూడా ఉన్న విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. కానీ ఇప్పటివరకు ఆయన్ను కలవలేదు' అంటూ రాశి చెప్పుకొచ్చింది.