Rambha: హీరోయిన్ రంభ ఇంట విషాదం.. ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేరని ఎమోషనల్ పోస్ట్

Rambha: హీరోయిన్ రంభ ఇంట విషాదం.. ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేరని ఎమోషనల్ పోస్ట్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని రంభ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయింది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్నా.. మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“ప్రియమైన నాన్నగారూ, నా హృదయంలో మీ స్థానం ఎవ్వరూ ఎప్పటికీ భర్తీ చేయలేరని నాకు తెలుసు. నేను ఎంత గొడవలు పెట్టినా, మీకు ఎంత ఇబ్బందులు కలిగించినా, మీరు మాత్రం ప్రతిసారీ అదే చిరునవ్వుతో అన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీరు లేకపోవడంతో ఈ ప్రపంచం అంతా శూన్యంగా అనిపిస్తోంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్న’’ అని రంభ ఎమోషనల్ పదాలు రాసుకొచ్చింది. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు ధైర్యంగా ఉండాలని పోస్టులు పెడుతున్నారు.

విజయవాడకు చెందిన రంభ (అసలు పేరు యూదీ విజయలక్ష్మి). 1990 వ దశకంలో తన అందంతో..డ్యాన్స్ తో స్టార్ హీరోస్ అందరితో నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ మలయాళం, కన్నడ భాషల్లో నటించి ఫేమస్ అయ్యారు.

Also Read : అల్లు అర్జున్ చేతికి ఉన్న వాచ్ రేటుకు

2010లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం కుటుంబంతో విదేశాల్లో ఉంటున్నారు. అయితే రంభ మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రియాలిటీ టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.