సినిమా, క్రికెట్ స్టార్ల కలయిక అభిమానులకు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. ఇటీవల అల్లు అర్జున్, RCB హిట్టర్ స్టార్ వెంకటేష్ అయ్యర్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అయాన్‌కు వెంకటేష్ అయ్యర్.. ఆర్‌సీబీ జెర్సీ గిఫ్ట్‌గా ఇవ్వగా, బన్నీ ఆయనకు బెస్ట్ విషెష్ తెలిపాడు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే నెటిజన్ల దృష్టి అల్లు అర్జున్ చేతికి ఉన్న వాచ్ పైన పడింది. వైరల్ అవుతున్న ఫొటోలో అల్లు అర్జున్ ‘పాటెక్ ఫిలిప్’ కంపెనీకి చెందిన నాటిలస్ మూన్‌ఫేస్ రోజ్ గోల్డ్ వాచ్‌ను ధరించారు. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్తో తయారీ చేసిన ఈ లగ్జరీ వాచ్ ధర దాదాపు రూ.2.75 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో ఈ వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
It was a pleasure meeting talented young Indian cricketer @venkateshiyer garu today.
— Allu Arjun (@alluarjun) May 23, 2026
Special thanks to him for gifting #AlluAyaan a special signed jersey.
Wishing you all the very best for your future endeavours. Warm regards 🖤 pic.twitter.com/ME8w1CVSgp
ఇదే సమయంలో అల్లు అర్జున్ వాచ్ కలెక్షన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆయన వద్ద కార్టియర్ (Cartier), బ్రైట్లింగ్ (Breitling) వంటి పలు అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ల వాచ్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు భిన్న రకాలుగా రియాక్ట్ అవుతూ పోస్టులు పెడుతున్నారు. “ఇది సార్ బన్నీ రేంజ్” అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు “ఒక వాచ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఆశ్చర్యంగా ఉంది” అని అభిప్రాయపడుతున్నారు.
ALSO READ : మరీ ఇంతలా దిగజారారు ఏంట్రా
ఇంకొందరు “ఇంత డబ్బుతో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని జీవితాంతం సంతోషంగా చూసుకోవచ్చు” అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొందరైతే అల్లు అర్జున్ చేతికి ఉన్న వాచ్ రేటుకు.. హైదరాబాద్లో మంచి లగ్జరీ ప్లాట్ కొనొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.
‘రాకా’ షూటింగ్ అప్డేట్:
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రాకా’ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా, నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను చాలా కీలకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్‌తోపాటు హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె కూడా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరిపై పలు కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నట్టు సమాచారం.
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిస్తుడటంతో వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని అట్లీ భావిస్తున్నారట మేకర్స్. షూటింగ్ పూర్తయిన తర్వాత వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
#RAAKA pic.twitter.com/BY1dzQFLY8
— Allu Arjun (@alluarjun) April 8, 2026
