మరీ ఇంతలా దిగజారారు ఏంట్రా: అమ్మాయిలనే కాదు గోడమీద బొమ్మల్ని కూడ వదలటం లేదుగా: హీరోయిన్ సీరియస్

మరీ ఇంతలా దిగజారారు ఏంట్రా: అమ్మాయిలనే కాదు గోడమీద బొమ్మల్ని కూడ వదలటం లేదుగా: హీరోయిన్ సీరియస్

ప్రస్తుతం యువతలో పెరుగుతున్న ఆలోచనా విధానం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒక మహిళ ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చుట్టూ ఉన్న వారి ప్రవర్తనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, మానసిక ఒత్తిళ్ల వంటి ఘటనలు సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఇటీవల మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ మహిళ పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. అదే సమయంలో కట్న వేధింపులు, మానసిక హింస కారణంగా ఓ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈసారి జీవించి ఉన్న మహిళపై కాదు, స్విమ్మింగ్ పూల్ గోడపై ఉన్న మహిళా చిత్రాన్ని చూసి కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీసింది

‘ట్యూబ్ ఇండియన్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు యువకులు స్విమ్మింగ్ పూల్ గోడపై ఉన్న మహిళా చిత్రంతో అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తాజాగా ఈ వీడియోని బాలీవుడ్ విలక్షణ నటి భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఎప్పటికప్పుడు మహిళల భద్రతపై గళమెత్తే నటి, ఈసారి మరింత ఉక్రోషంగా స్పందించింది. ప్రస్తుత సమాజ పరిస్థితిని ఎండకడుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 

►ALSO READ | ప్రభుత్వానికి సొంత ఓటీటీ ఉండాలి: టికెట్ల రేట్లు కూడా పెంచాలంటూ CM విజయ్కు సేతుపతి రిక్వెస్ట్‌

నటి భూమి స్పందిస్తూ “ఇదే మన యువత మానసిక స్థితి. ఇలాంటి ఆలోచనలే భవిష్యత్తులో మహిళలు, చిన్నారులపై నేరాలకు దారితీస్తాయి” అని వ్యాఖ్యానించారు. కేవలం ఖండించడం సరిపోదని, నిందితులకు కఠినమైన చట్టాలు అవసరమని ఆమె అన్నారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులు, కట్న వేధింపుల ఘటనలు సమాజ పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, కొందరు యువతలో పెరుగుతున్న వికృత ఆలోచనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసేలా మారింది. సమాజంలో మహిళల పట్ల గౌరవం, బాధ్యత, సరైన విలువలు పెంపొందించడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

ఢిల్లీలో ఆరేళ్ల చిన్నారిపై..

భూమి పెడ్నేకర్ రియాక్ట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా మహిళలపై నేరాల విషయంలో భూమి గట్టిగా స్పందించారు. ఢిల్లీలో ఆరేళ్ల చిన్నారిపై మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇంత చిన్న వయసు పిల్లలు ఇలాంటి ఘోరాలకు పాల్పడటం హృదయ విదారకం. వారు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో ఊహించవచ్చు” అని అన్నారు.

భూమి 'దం లగా' కే హైషా సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె 'దళ్ దళ్', 'భక్షక' అనే వెబ్ సిరీస్‌లలో నటించి ప్రశంసలు అందుకున్నారు. వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు ఎలాంటి సవాళ్లు, ఇబ్బందులు ఎదురుకునే వాటిపై చర్చించి వర్సటైల్ నటిగా గుర్తింపు పొందారు.