సరిగా ఏ పని చేయలేకపోతున్నా.. వితికా ఎమోషనల్ వీడియో

సరిగా ఏ పని చేయలేకపోతున్నా.. వితికా ఎమోషనల్ వీడియో

టాలీవుడ్​ నటి వితికా షేరు(Vithika Sheru) సోషల్​ మీడియాలో ఎమోషనల్​ వీడియోని షేర్​ చేసింది. తనను వరుస ఆరోగ్య సమస్యలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలిపింది. ఈ కారణంతోనే తన యూట్యూబ్​చానెల్​కు కూడా దూరంగా ఉంటున్నట్టు పేర్కొంది.

తాను ఎప్పటినుంచో మైగ్రేన్​, స్పాండిలైటిస్​తో సఫర్​ అవుతున్నట్టు తెలిపింది. వీటి వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్టు..ఏ పని కూడా సరిగా చేయలేకపోతున్నట్టు వితికా చెప్పింది. ప్రస్తుతం వీటికి చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే మళ్లీ నార్మల్​ అవుతానని..తిరిగి మరిన్ని మంచి యూట్యూబ్ వీడియోస్ చేస్తానని ​తెలిపింది.

Also Read : మరో ఇంట్రెస్టింగ్​ ప్రాజెక్ట్​లో జైభీమ్​ సినతల్లి..

ఇక టాలీవుడ్​ లో 2016లో వచ్చిన పడ్డానండి ప్రేమలో మరి మూవీతో హీరో వరుణ్​సందేశ్(Varun Sandesh)​ తో కలిసి నటించింది. ఈ మూవీతో లవ్ లో పడ్డ ఈ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట బిగ్​బాస్​ రియాలిటీ షో మూడవ సీజన్ లో పాల్గొన్నారు.