సర్కారు కాలేజీల్లో అడ్మిషన్స్‌‌ పెరిగినయ్‌‌

సర్కారు కాలేజీల్లో అడ్మిషన్స్‌‌ పెరిగినయ్‌‌

పోయినేడాది 78,249, ఈఏడాది 86,142 అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో జాయిన్‌‌ అయిన స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ఉన్న 404 సర్కారు కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌‌‌‌లో 86,142 మంది స్టూడెంట్స్​అడ్మిషన్ తీసుకోగా, వీరిలో 19 వేల మంది ఒకేషనల్ కోర్సుల్లో జాయిన్ అయ్యారు. లక్షమందికి పైగా స్టూడెంట్స్ జాయిన్‌‌ అయినా, వివిధ కారణాలతో కొందరు డ్రాప్ అయ్యారని ఆఫీసర్లు చెబుతున్నారు. 2019–20 విద్యాసంవత్సరంలో ఫస్టియర్​లో 78,249 మంది చేరారు. ఈ లెక్కన పోయిన ఏడాది కంటే 7,893 అడ్మిషన్లు పెరిగాయి.

లాస్టియర్‌‌‌‌తో పోలిస్తే 25 జిల్లాల్లో ఈసారి ఫస్టియర్‌‌‌‌ అడ్మిషన్లు పెరగగా, పది జిల్లాల్లో తగ్గాయి. హైదరాబాద్–1, హైదరాబాద్–2, సిద్దిపేట, వరంగల్ అర్బన్, జగిత్యాల, మహబూబ్‌‌నగర్​తదితర జిల్లాల్లో అడ్మిషన్లు పెరిగాయి. కరోనా నేపథ్యంలో పోయినేడాది టెన్త్‌‌ స్టూడెంట్స్​అంతా పాస్​ కావడంతో, అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు అనుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు రాలేదంటున్నారు. ఇంటర్ స్టూడెంట్స్‌‌కు మిడ్‌‌ డే మీల్స్ పెడతామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో చాలామంది కాలేజీల్లో చేరారని, కానీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా మిడ్‌‌ డే మీల్స్ పెట్టకుండా వారిని మోసం చేసిందని లెక్చరర్లు వాపోతున్నారు.