బాహుబలి పెళ్లి చేసేసిన AI : మురిసిపోతున్న ఫ్యాన్స్

బాహుబలి పెళ్లి చేసేసిన AI : మురిసిపోతున్న ఫ్యాన్స్

ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్(Prabhas) కు పెళ్లయిపోయింది. అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు మన అనుష్క(Anushka)నే. ఈ జంటకు ఒక పాప కూడా. ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా? అవును నేను చెప్పింది నిజమే. ప్రభాస్, అనుష్కకు పెళ్లయింది. అయితే ఈ పెళ్లి చేసింది వాళ్ళ పెద్దలు కాదు.. ఏఐ. అవును.. ఏఐ టెక్నాలజితో ప్రభాస్, అనుష్కకు పెళ్ళైతే ఎలా ఉంటుంది? వారికి పాప పుడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది నెటిజన్స్ కు. 

ఆలోచన రావడమే ఆలస్యం ఏఐ ద్వారా ఈ ఇద్దరికీ పెళ్లి చేసి, ఒక బుజ్జి పాపను కూడా పుట్టించేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్స్.. అబ్బా.. ప్రభాస్, అనుష్క జంట ఎంత బాగుందో.. నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.       

నిజానికి చాలా కాలంగా ప్రభాస్, అనుష్కల పెళ్లి మ్యాటర్ ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. బాహుబలి సమయంలో అయితే.. సినిమా పూర్తయిన వెంటనే ఈ ఇద్దరు పెళ్లిచేసుకోబోతున్నారు అనే వార్తలు బలంగా వినిపించాయి. ఇదే విషయాన్ని చాలా మంది ప్రభాస్, అనుష్క దగ్గర ప్రస్తావించారు కూడా.. కానీ దానికి ఈ ఇద్దరు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ ఒకేలా స్పందించారు. మరి తాజాగా వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్ పై ప్రభాస్, అనుష్క ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే నిజంగా ఎలాగూ జరగడం లేదు.. కనీసం ఇలా అయినా మా ముచ్చట తీరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్.

ALSO READ: సైంధవ్‌ మూవీ బిగ్ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది