ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కొత్త వీడియో.. ఓ పక్క మంటలు..భయంతో భవనంపైనుంచి దుంకుతున్న మెడికోలు..

ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కొత్త వీడియో.. ఓ పక్క మంటలు..భయంతో భవనంపైనుంచి దుంకుతున్న మెడికోలు..

దేశం మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురి చేసిన విషాద ఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాదం..అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిర్ ఇండియా విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలి 280 మంది చనిపోయిన విషయం తెలిసింది.. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సోమవారం (జూన్ 17)  కాలేజీహాస్టల్ భవనంపై విమానం కూలిన భయంకరదృశ్యాలు, మెడికోలు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి దుంకిన వీడియాలు బయటికి  వచ్చాయి. 

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత బీజే మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హాస్టల్ గదుల నుండి తప్పించుకుంటున్నట్లు చూపించే కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. వైద్య విద్యార్థులు తమ హాస్టల్‌లోని రెండు , మూడో అంతస్తులనుంచి  బెడ్‌షీట్‌ల సహాయంతో బాల్కనీల నుంచి దుంకుతున్నట్లు వీడియోల కనిపిస్తోంది. 

బీజే కాలేజీ హాస్టల్ భవనాల్లో ఒకదానిలోకి విమానం దూసుకుపోయింది..ప్రమాదంలో ఇంధనం అంటుకొని పెద్ద ఎత్తున మంటలు లేచి పక్కన ఉన్న చెట్లు, భవనాలకు కూడా మంటలంటుకున్నాయి. ఈ క్రమంలో భవనాల్లో ఉన్న విద్యార్థులు తప్పించుకునేందుకు రెండు మూడు అంతస్థులనుంచి బెడ్ షీట్లు కట్టి కిందకు దూకారు. 

ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఈ వీడియో విడుదలయ్యాయింది. భవనంలో ఓ పక్క మంటలు చెలరేగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మంటల్లో చిక్కుకున్నవారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.    

ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో 54 మంది మెడికోలు, సిబ్బంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డారు. 

ప్రమాదానికి గురైన విమానంలో అనుభవజ్ణులైన పైలట్లు ఉన్నప్పటికీ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లో కూలిపోవడం మిస్టరీగా మారింది. దాదాపు 10వేల గంటలు నడిపిన అనుభవం ఉన్న కెప్టెన్ సుమీత్ సభర్వాల్, 11వందల గంటల అనుభవం ఉన్న కో పైలట్ క్లైవ్ కుందర్ పైలట్లుగా ఉన్నారు. వారు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ | అదే రూట్.. అదే కంపెనీ ఫ్లైట్: సాంకేతిక సమస్యతో అహ్మదాబాద్ టూ లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు

 ప్రమాదానికి గల కారణాలు తెలియజేసే కీలక ఆధారం బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేసిస్తే గానీ ప్రమాం ఎలా జరిగింది. ఎందుకు జరిగింది అనే విషయాలు బయటికి రానున్నాయి.