
అజయ్ దేవగణ్ హీరోగా విజయ్ కుమార్ అరోరా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ దేవ్‌గణ్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘ది రిటర్న్ ఆఫ్ ది సర్దార్’అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్‌ను రెండు వార్ ట్యాంకర్స్‌పై అజయ్ దేవగణ్ నిలుచున్నట్టుగా డిజైన్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, సాహిల్ మెహతా, సంజయ్ మిశ్రా, రవికిషన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు చిత్రం ‘మర్యాద రామన్న’ఆధారంగా పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్’కు ఇది సీక్వెల్. ఈసారి డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ ఉండబోతోందని చెబుతున్నారు మేకర్స్. సింగం అగైన్, షైతాన్, భోళా, మైదాన్ లాంటి సీరియస్ సినిమాల తర్వాత అజయ్ దేవగణ్ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ కావడంతో ఆసక్తి నెలకొంది. జులై 25న సినిమా విడుదల కానుంది.
The Return of the Sardaar 🔥#SOS2 in cinemas near you on 25th July. #SardaarIsBack #SonOfSardaar2 @mrunal0801 @jiostudios @ADFFilms @tseries #JyotiDeshpande @KumarMangat @nrpachisia #PravinTalreja #VijayKumarArora #JagdeepSinghSidhu @danishdevgn pic.twitter.com/vzSelTPEpV
— Ajay Devgn (@ajaydevgn) June 19, 2025