తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన బాంబ్ పేల్చారు ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్. సీఎం విజయ్ గురించి ఆయన చెబుతూ వస్తున్న అంశాలు అన్నీ ఇప్పుడు నిజం కావటంతో.. ఆయన గురించి పెద్ద చర్చ నడుస్తుంది. విజయ్ సీఎం అయిన వెంటనే.. సీఎం ఆఫీసులో OSD.. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద నియమించారు. జ్యోతిష్యుడిని OSD ఎలా చేస్తారని మిత్రపక్షాల నుంచే విమర్శలు రావటంతో.. జీవో రద్దు చేశారు. ఈ అంశంపై ఫస్ట్ టైం నోరు విప్పారు ఆ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్.
తమిళనాడు రాజకీయాల్లో ఇద్దరికి సీఎం అయ్యే యోగం ఉందని.. అందులో ఒకరు హీరో అజిత్.. మరో హీరో విజయ్. ఈ ఇద్దరికీ తమిళనాడు రాజకీయాలను మార్చగల సత్తా ఉందని.. సీఎం అయ్యే యోగం ఉందని వెల్లడించారాయన. హీరో విజయ్ తనకు ఉన్న బలాన్ని, యోగాన్ని ఉపయోగించుకుని సీఎం అయ్యారని.. హీరో అజిత్ ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదని వెల్లడించారాయన.
జయలలిత మరణం తర్వాత హీరో అజిత్, హీరో విజయ్ ఇద్దరినీ కలవటానికి ప్రయత్నించానని.. వాళ్లకు ఉన్న యోగం గురించి చెప్పటానికి ప్రయత్నించినట్లు వివరించారాయన. హీరో అజిత్ అస్సలు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని.. కనీసం కలవలేదని చెప్పిన ఆయన.. హీరో అజిత్కు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలుసుకుని వదిలేసినట్లు వివరించారాయన.
ఆ తర్వాత విజయ్ పార్టీ పెట్టటం.. గెలవటం.. సీఎం కావటం జరిగిందని.. ఇప్పుడు అజిత్ ఆ ఛాన్స్ మిస్ అయ్యారని స్పష్టం చేశారు జ్యోతిష్యుడు రాధన్ పండిట్. రాబోయే 40, 50 ఏళ్లు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్తావన ఉంటుందని.. అతనికి ఓటమి లేదని.. అన్నాడీఎంకే పార్టీ అతి చిన్న పార్టీగా మిగిలిపోతుందని వివరించారాయన.
►ALSO READ | ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్ సింగ్కు బిగ్ షాక్.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
ఇప్పుడు అజిత్ రాజకీయాల్లోకి వచ్చినా.. అంత ప్రభావం చూపించలేరని.. అజిత్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు వెల్లడించారాయన. విజయ్ 100 ఏళ్లు బతుకుతారని.. అతనిది అంత బలమైన జాతకం అని.. రాజకీయాల్లో విజయ్ కు ఓటమి అనేది ఉండదంటూ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు రాధన్ పండిట్.
సీఎంగా ఉన్న స్టాలిన్ ఓడిపోతాడని.. ఉదయనిధి గెలుస్తాడని.. డీఎంకే అధికారంలోకి రాదని ఎన్నికలకు ముందే చెప్పానని.. కావాలంటే తన పాత వీడియోలు చూసుకోవాలంటూ ఛాలెంజ్ చేశారాయన.
తమిళనాడు రాజకీయాల్లో హీరో అజిత్ సీఎం అయ్యే అవకావాన్ని మిస్ చేసుకున్నారని.. విజయ్ దాన్ని సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుని సీఎం అయ్యారని వివరించారు రాధన్ పండిట్ వెట్రివేల్..
