ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ కుల్దీప్ సింగ్ సెంగార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2017లో మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆయనపై ఉన్న జీవితకాల శిక్షను రద్దు చేసిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో మరోసారి పిటీషన్ విచారణ జరపాలని హైకోర్టుకు సూచించింది. ఈకేసు విషయంలో ఎలాంటి అభిప్రాయం చెప్పే ఉద్దేశం లేదని.. మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంటా కాదా అనే అంశంలో మరోసారి విచారించాలని సూచించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చి లతో కూడిన బెంచ్.. ఈ అంశంపై త్వరగా తేల్చాలని సూచించింది.
2025 డిసెంబర్ 23న సెంగార్ యావజ్జీక శిక్షపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.పబ్లిక్ సర్వెంట్ తీవ్ర లైంగిక దాడికి దిగినట్లు సెంగార్ పైన పోక్సో చట్టం, సెక్షన్ 5(c)పైన కేసు నమోదైందని.. కానీ ఎన్నికైన ప్రజా ప్రతినిధి పబ్లిక్ సర్వెంట్ కిందికి రాడని పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21 అదే సూచిస్తుందని పేర్కొంది. ఈ కారణం చేత సెంగార్ యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అదే విధంగా ఏడేండ్ల 5 నెలలు జైలు శిక్ష అనుభించినట్లు పేర్కొంది.
►ALSO READ | దక్షిణాదిలో ఫ్రెండ్లీ పాలిటిక్స్.. తమిళనాడులో విజయ్.. కేరళలో వీడీ సతీశన్ !
యావజ్జీవ శిక్షను సస్పెండ్ చేయడంపై సీబీఐ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. 2025 డిసెంబర్ 29న హైకోర్టు ఆర్డర్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. అదే విధంగా ఆయనను కస్టడీ నుంచి విడుదల చేయడానికి వీలులేదని చెప్పింది.
లేటెస్టుగా ఈ కేసులో పిటీషన్ విచారించిన సుప్రీం కోర్టు.. సెంగార్ పబ్లిక్ సర్వెంటా కాదా అనే అంశాన్ని తేల్చేందుకు మరోసారి విచారించాలని సూచించింది.
ప్రజల చేత ఎన్నుకైన ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదని.. యావజ్జీవ శిక్షను రద్దు చేసిన హైకోర్టు నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే. తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు.
